2003

తమలపాకు

Tamalapaku

🎬 Dil
Advertisement
తమలపాకు నెమలి సోకు
Advertisement

తమలపాకు నెమలి సోకు అటు వైపు ఇటు వైపు సొగసే నీకు ఇక చాలు అతిగా మరి పొగడమాకు
పలుకే చిలకా పలుకు ఇదిగో పిలగో వద్దకు రాకు
తమలపాకు నెమలి సోకు
నిన్నా మొన్నా రెండు జళ్ల బుల్లి బొమ్మవు కాదా నాతో పాటు నువ్వు కూడా అమ్మ కూచివేగా
పైట వేసి వెయ్యంగానే వయ్యారమెందుకే భామ ఆహ కొంటె చూపులు ఎక్కువాయె మీసమొచ్చినందుకా
నడుము చిక్కేనే నడక మారేనే ఇంత లోపల ఏమి జరిగేనే మొదటిసారిగా ఆడపిల్లను చూసినట్టుగా మైకం మీకు
తమలపాకు నెమలి సోకు
బాపు గీసే కుంచెకు నువ్వు ఇష్టమంటనే పిల్లా నువ్వే చక్కని చుక్కావంటూ సూటిగా చెప్పొచ్చుగా
సిన్నీ నవ్వు నవ్వమంటే కోపమెందుకే మీకు పాపం పోనీ అంటూ నవ్వితే ప్రేమిస్తమంటారుగా
ఓరి దేవుడో గుండె లోపలి అసలు సంగతి ఎలా తెలిసేరో మాట ముసుగులో మనసు ఏమిటో మాకు తెలియదా పోవోయ్ బాబు
తమలపాకు నెమలి సోకు
తమలపాకు నెమలి సోకు అటు వైపు ఇటు వైపు సొగసే నీకు ఇక చాలు అతిగా మరి పొగడమాకు
పలుకే చిలకా పలుకు ఇదిగో పిలగో వద్దకు రాకు
తమలపాకు నెమలి సోకు
Cast & Crew
🎤SingersR.P PatnaikUsha
✍️LyricsSuddala Ashok Teja
🎵MusicR.P Patnaik
HeroNithiin
💫HeroineNeha
🎬DirectorV.V. Vinayak