2003

గాజులు ఘల్లుమన్నవే

Gajulu Gallumannave

🎬 Dil
Advertisement
గాజులు ఘల్లుమన్నవే పిల్ల గుండెలు ఝల్లుమన్నవే
Advertisement

అబ్బబ్బో మావ అదిరింది భామ ఈ చందమామ అడిగేసేయ్ మావ ఓ
నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్తెమ్మ
నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్తెమ్మ
నీ కాలి మువ్వల్లో సైగలున్నవే నీ కాలి మువ్వల్లో సైగలున్నవే చాటుగ వచ్చి సరసం ఆడమన్నవే
నేనొల్ల నేనొల్ల నేనోళ్లారో ఆకతాయి సిన్నోడా నేనోళ్లారో మాటకారి సిన్నోడా
మా ఓళ్లతో నాకు మాటొస్తది మాటొస్తది మావ మాటొస్తది
నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్టా నడుము సత్తెమ్మ
నీ పాల బుగ్గ సిరిమల్లె మొగ్గ నా చేత గిల్లాలని ఉబలాటమే నీ లేత నడుము సంపంగి వనము ఓసారి తాకాలని ఆరాటమే
ఏం పిల్ల మాటాడవు ఓ ఎర్రవోని ఎంకటమ్మ ఏం పిల్ల మాటాడవు
ఏం పిల్ల ఎదురియ్యావు ఈ చిందులేసే సిన్నోడికి ఏం పిల్ల ఎదురియ్యావు
నా పాలబుగ్గ గోరింక గిల్లె నా లేత నడుము నెలవంక అడిగే ఇంకేదో ఇమ్మంటే ఇచ్చేస్తాలే
అరె నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్తెమ్మ నేనొల్ల నేనొల్ల నేనోళ్లారో నేనోళ్లారో ఆకతాయి సిన్నోడా
నీ తీపి ముద్దు సరిహద్దులొద్దు పోతుందే పొద్దు ఊరించొద్దే నీ కౌగిలింత ఓ పాల పుంత కసరోద్దే కాంత చేరే చెంత
బాలమణి బాలామణి బాలమణి కబురెందో సెప్పరాదే బాలమణి బాలమణి బాలామణి బాలమణి మనసేదో విప్పరాదే బాలమణి
నా తీపి ముద్దు నా చిలక కిద్దు నా కౌగిలింత మరుమల్లె కిద్దు మిగిలింది నీదేలే ఏళ్ళు ఏళ్ళల్లోయ్
నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్తెమ్మ
నీ కాలి మువ్వల్లో సైగలున్నవే నీ కాలి మువ్వల్లో సైగలున్నవే చాటుగ వచ్చి సరసం ఆడమన్నవే
నేనొల్ల నేనొల్ల నేనోళ్లారో ఆకతాయి సిన్నోడా నేనోళ్లారో మాటకారి సిన్నోడా
మా ఓళ్ళతో నాకు మాటొస్తది మాటొస్తది మావ మాటొస్తది
నీ చేతి గాజులు ఘల్లుమన్నవే పిల్ల ఘల్లుమన్నవే పిట్ట నడుము సత్తెమ్మ
Cast & Crew
🎤SingersR.P PatnaikUsha
🎵MusicR.P Patnaik
HeroNithiin
💫HeroineNeha
🎬DirectorV.V. Vinayak