2003

పెద్దలొద్దంటున్న

Peddaloddantunna

🎬 Dil
Advertisement
పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ నింగి పడిపోతున్న నేల విడిపోతున్న నీరు నిప్పోవుతున్న జానే దిదో యార్
Advertisement

ప్యార్ కీయ తో డర్నా క్యా
పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్
విధినైనా ఎదిరిస్తుంది ఎదలో నిండి ఈ ప్రేమా వద్దన్నా మనసిస్తుంది వరమౌతుంది ఈ ప్రేమా
చరితల్లో గెలిచింది ప్రేమే కదా జగమంతా నిండింది ప్రేమే కదా
ఎన్ని హద్దులున్న ఓడిపోదు ప్రేమ ఎల్లలెన్ని ఉన్నా తలవంచునా
ప్యార్ కీయ తో డర్నా క్యా
పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్
కలలైనా కలకాలేదు కలిసిందంటే ఈ ప్రేమ క్షణమైనా ఎడబాటేగా ముడివేసాకా ఈ ప్రేమ
ఆరారు కాలాల అందం కదా ఏడేడు జన్మాల బంధం కదా
ప్రేమ లేని చోట బ్రతుకు ముళ్ళ బాట ప్రేమ తోడు ఉంటె గెలుపేనటా
ప్యార్ కీయ తో డర్నా క్యా
పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్ నింగి పడిపోతున్న నేల విడిపోతున్న నీరు నిప్పోవుతున్న జానే దిదో యార్
ప్యార్ కీయ తో డర్నా క్యా
Cast & Crew
✍️LyricsPeddada Murthy
🎵MusicR.P Patnaik
HeroNithiin
💫HeroineNeha
🎬DirectorV.V. Vinayak