సీఎం పీఎం అవ్వాలన్న ఆశే లేదు
యూకే యూఎస్ వెళ్లాలన్న షోకే లేదు
Advertisement
కోటల్లోనే ఉండాలన్న రూలేం లేదు
కోట్లల్లోనే మునగాలన్న కోరిక లేదు
హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి
కొంచెం నేమ్ ఉంటే చాలు
కొంచెం ఫేమ్ ఉంటే చాలు
కొంచెం డబ్బుంటే చాలు
కొంచెం దిల్ ఉంటే చాలు
సీఎం పీఎం అవ్వాలన్న ఆశే లేదు
యూకే యూఎస్ వెళ్లాలన్న షోకే లేదు
డైలీ నేను తిరగడానికి
చార్టెడ్ ఫ్లైట్ ఏం వద్దు
సింపుల్ బైక్ ఒకటుంటే చాలు
బీటే నేను వెయ్యడానికి
మిస్ యూనివర్స్ ఏం వద్దు
లోకల్ బ్యూటీ అయితే చాలు
అలసట వస్తే తాగడానికి
అమృతమేమి వద్దు
చల్లని బీరొకటుంటే చాలు
ఆపదలో కాపాడటానికి
పైవాడేమి వద్దు
నలుగురు ఫ్రెండ్సే ఉంటే చాలు
హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి
కొంచెం నేమ్ ఉంటే చాలు
కొంచెం ఫేమ్ ఉంటే చాలు
కొంచెం డబ్బుంటే చాలు
కొంచెం దిల్ ఉంటే చాలు
సీఎం పీఎం అవ్వాలన్న ఆశే లేదు
యూకే యూఎస్ వెళ్లాలన్న షోకే లేదు
కావలసింది చూడటానికి
కంప్యూటర్ తెరవద్దు
కమ్మని కలలే కంటే చాలు
బ్రతకాల్సింది బ్రతకడానికి
ఏడు జన్మలే వద్దు
ఉన్న ఒక్క జన్మమే చాలు
పుణ్యం కాస్త దక్కడానికి
పూజలు గీజలు వద్దు
పరులకు సాయం చేస్తే చాలు
చెయ్యాల్సింది చెయ్యడానికి
పంచాంగం విప్పొద్దు
పంజా విప్పావంటే చాలు
హ్యాపీగా లైఫ్ అంతా గడపడానికి
కొంచెం నేమ్ ఉంటే చాలు
కొంచెం ఫేమ్ ఉంటే చాలు
కొంచెం డబ్బుంటే చాలు
కొంచెం దిల్ ఉంటే చాలు
ఆశే లేదు షోకే లేదు
రూలేం లేదు కోరిక లేదు