2004

నువ్వొస్తానంటే

Nuvosthanate

🎬 Varsham
Advertisement
చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
Advertisement

పంచ వన్నె చిలకలల్లే వజ్రాల తునకలల్లే వయసు మీద వాలుతున్న వాన గువ్వలో
చినుకు రవ్వలో చినుకు రవ్వలో చిన్నదాని సంబరాన చిలిపి నవ్వులో
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్లని దాకుంటావే పైన చుట్టంలా వస్తావె చూసెల్లి పోతావె అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యరా చేరధీసుకొన
నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా
తాటికిట తాటికిట తాటికిట తం
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్లని దాకుంటావే పైన
ముద్దులొలికే ముక్కు పుడకై ఉండిపోవే ముత్యపు చినుకా చెవులకు సన్న జూకాల్లాగా చేరుకోవే జిలుగులు చుక్క
చేతికి రంగుల గాజుల్లాగా కాలికి మువ్వల పట్టిలాగా మేడలో పచ్చల పతాకంలాగా వదలకు నిగ నిగ నగలను తొడిగేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా
తాటికిట తాటికిట తాటికిట తం
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్లని దాకుంటావే పైన
చిన్న నాటి తాళీనైనా నిన్ను నాలో దాచుకొన్న కన్నే యేటి సోయగంలా నన్ను నీలో పోల్చుకొన
పెదవులు పాడే కిల కిల లోన పదములు ఆడే కధాకళీ లోన కనులను తడిపే కలతలా లోన నా అను అణువున నువ్వు కనిపించేలా
నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా
తాటికిట తాటికిట తాటికిట తం
ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వాన ఎన్నాళ్లని దాకుంటావే పైన
చుట్టంలా వస్తావె చూసెల్లి పోతావె అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యరా చేరధీసుకొన
నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా నువ్వొస్తానంటే నేనొద్దంటానా