Advertisement
మెల్లగా కరగని రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
Advertisement
వలపు వాన గారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం
తడిపి తడికి తనతో నడిపి హరివిల్లుని
వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
మెల్లగా కరగని రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్న
ఈ తొలకరిలో తళ తళ నాట్యం నీదేనా
ఆ ఉరుములు లోన నీ పిలుపులు వింటున్న
ఈ చిట పటలో చిటికెల తాళం నీదేనా
మతి చెడె దాహమై అనుసరించి వస్తున్నా
జత పడే స్నేహమై అనునయించాన
చలి పిడుగులా సడి విని జడిసి బిడియం
తడబడి నిన్ను విడదా
ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
ఏ పెనుమరుగైన ఈ చొరవను ఆపేన
నా పరువం నీ కనులకు కానుక ఇస్తున్న
ఏ చిరు చినుకైనా నీ సిరులను చూపేనా
ఆ వరునికె రుణపడిపోనా ఈ పైన
త్వరపడే వయసుని నిలుపలేను ఇకపైన
విడుదలే వద్దని ముడులువేయన
మన కలయిక చెదరని చెలిమిని
రుజువని చేరితలు చదివేలా
ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం
మెల్లగా కరగని రెండు మనసుల దూరం
చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం
వలపు వాన గారాలే పంపుతున్నది ఆకాశం
చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం
తడిపి తడికి తనతో నడిపి హరివిల్లుని
వంతెన వేసిన శుభవేళా
ఈ వర్షం సాక్షిగా తెలుపని నువ్వు నాకే సొంతం
ఈ వర్షం సాక్షిగా కలపని బంధం