2019

ఏ మనిషికే మజిలీయో

Ye Manishike Majiliyo

🎬 Majili
Advertisement
ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు
Advertisement

నువ్వు నిజంలాగా నను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కాలాల్లోనే ఉన్నా నువ్వు ప్రతిసారి నీ ప్రపంచంల నను చూస్తున్నా నేను అదే పనిగా నిను వేలేస్తూనే ఉన్నా నువ్వు నను కడలిలో ఆ కెరటమల్లె విడిపోకున్నా నేను ఒక మనసులేని శిలలాగా మారినానా
ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు
ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడి వేస్తాడు ఎదలోని ప్రేమను వేరే మజిలీకి చేరుస్తాడు
నా నిన్నలోని ఆ గురుతులన్నీ ఈ మనసులోంచి చెరిపేదెలాగా ఇన్నాళ్లు నాలో కలిసున్నా ప్రాణం నీ వేరు చేసి బ్రతికేదేలాగా ఈ వేషమే ఎన్నాళ్లని విధి ఆడుతోందా ఈ నాటకాన్ని
నువ్వు నిజంలాగా నను ముడేస్తుంటే ఈ నిమిషాన నేను గతంలోని ఆ కాలాల్లోనే ఉన్నా
నీ పిలుపు కోసం వేటికినీడి మౌనం ఆ వారము కోరి మిగిలుంది ప్రాణం నా గుండెనడుగు చెబుతుంది నీకే ఈ ఊపిరుండీ నీ చెలిమి కొరకే నీ కోసమే వెచ్చిందిలే నువ్వు సేద తీరే ఈ ప్రేమ మజిలీ
నేను నిజంలాగా నిను ముడేస్తుంటే ఈ నిమిషాన నువ్వు గతంలోని ఆ కాలాల్లోనే ఉన్నా నేను ప్రతిసారి నా ప్రపంచంల నిను చూస్తున్నా నువ్వు అదే పనిగా నను వేలేస్తూనే ఉన్నా నేను నిను కడలిలో ఆ కెరటమల్లె విడిపోకున్నా నువ్వు ఒక మనసులేని శిలలాగా మారినావా
ఏ మనిషికే మజిలీయో పైవాడు చూపిస్తాడు నువ్వు కోరుకుంటే మాత్రం దొరికేది కాదంటాడు ఓ మదిని దూరం చేస్తే ఇంకోటి ముడి వేస్తాడు ఎదలోని ప్రేమను వేరే మజిలీకి చేరుస్తాడు
Cast & Crew
✍️LyricsVanamali
🎵MusicGopi Sundar
🎬DirectorShiva Nirvana