2019

ప్రియతమా ప్రియతమా

Priyathama Priyathama

🎬 Majili
Advertisement
ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమ చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా
Advertisement

చెలి చూపు తాకినా ఉలకవా పలకవా వల వేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా
ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కారా చక్కనైన చుక్కారా నిన్ను కోరుకుందిరా సుందరా
ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమ చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా
నీ ప్రేమలో ఆరాధనై నె నిండుగా మునిగాకా నీకోసమే రాసానుగా నా కళ్ళతో ప్రియలేఖ
చేరునో చేరాదో తెలియదు ఆ కానుకా ఆశనే వీడక వెనక పడెను మనసుపడిన మనసెయ్
ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా
ఉన్నానిలా ఉంటానిలా ని నిడగా కడదాకా కన్నిటిలో కార్తీకపూ దీపాన్నిరా నువ్వులేక
దూరమే భారమై కదలదు నా జీవితం నీవు నా చేరువై నిలిచి మసలు మధుర క్షణములెప్పుడో
ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమ చిలిపి నీ తలపులో తెలిసినది వలపులో మధురిమా
చెలి చూపు తాకినా ఉలకవా పలకవా వాలా వేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా
ఇష్టమైన సఖుడా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కారా చక్కనైన చుక్కారా నిన్ను కోరుకుందిరా సుందరా
Cast & Crew
🎤SingersChinmayi Sripada
✍️LyricsChaitanya Prasad
🎵MusicGopi Sundar
🎬DirectorShiva Nirvana