2017

ఓ సక్కనోడా

o sakkanoda

🎬 Guru
ఓ సక్కనోడా
Advertisement
ఓ సక్కనోడా పట్టు పీడికిలై దాడి చేసినావె దడ దడ
Advertisement

కస్సు బస్సు కయ్యలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుద్ధాలు వెయ్యాలి తాళం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటివ్వు
నిన్ను పట్టేసుకుంటే జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబూ నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళి కట్టించుకుంట బాబూ
చిరుబుర్రుగా చిచ్చుబుడ్డిలా నువ్వంటే ఎడముఖమై తిరిగా నేను ఎపుడో అల తెలవారగా నను నేను నీ కలలో కనుగొన్నాను
నచ్చావు అందగాడా తెచ్చావు నాలో తేడా నువ్వాడే ఆట లాగే ప్రేమించు కాస్త నన్ను కూడా
నిన్ను పట్టేసుకుంటే జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళి కట్టించుకుంట బాబూ
పగవాడివో అయినోడివో తడిలేని పొడిచూపై తరి మేస్తావే మన మధ్యలో తెరలెందుకో గది ధాటి చెలిఒడిలో పడనంటావే
చిరునవ్వు చిలకరించు చిన్నపాటి చనువు పెంచు బుజ్జి బుజ్జి మనసు పాపం కన్నెత్తి దాన్ని కనికరించు
నిన్ను పట్టేసుకుంటే జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళి కట్టించుకుంట బాబూ
ఓ సక్కనోడా పట్టు పీడికిలై దాడి చేసినావె దడ దడ
కస్సు బస్సు కయ్యలు ఇంకెంత కాలం తీపి ముద్దు యుద్ధాలు వెయ్యాలి తాళం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటివ్వు
నిన్ను పట్టేసుకుంటే జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబూ
నన్ను ఇచ్చేసుకుంటా నిన్ను తెచ్చేసుకుంటా తాళి కట్టించుకుంటా బాబూ
Cast & Crew
🎤SingersDhee
✍️LyricsRamajogayya Sastry
HeroVenkatesh
💫HeroineRitika Singh