1991

కొత్త కొత్తగా

Kotha Kothaga

🎬 Coolie No.1
Advertisement
కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే... పూల ఏరులై... కోటి తారలే, పూల ఏరులై, నేల చేరగానే...
Advertisement

కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది
నా కన్ను ముద్దాడితే కన్నె కులుకాయె కనకాంబరం నా చెంప సంపెంగలో కెంపు రంగాయె తొలి సంబరం ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఎన్ని పొంగులో కుమారి కొంగులో ఎన్ని రంగులో సుమాల వాగులో ఉద్యోగమిప్పించవా సోకు ఉద్యాన వనమాలిగా జీతమియ్యగా లేత వన్నెలే చెల్లించుకోన...
కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే... పూల ఏరులై... కోటి తారలే, పూల ఏరులై, నేల చేరగానే కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది
నీ నవ్వు ముద్దాడితే మల్లెపువ్వాయె నా యవ్వనం నాజుకు మందారమే ముళ్ళ రోజాగ మారే క్షణం
మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాల లోగిలి మొగలి పరిమళం మొగాడి కౌగిలి మగువ పరవశం సుఖాల లోగిలి
కండల్లో వైశాఖమా కైపు ఎండల్లో కరిగించుమా తీగమల్లికి నరాల పందిరి అందించుకోన...
కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే... పూల ఏరులై... కోటి తారలే, పూల ఏరులై, నేల చేరగానే కొత్త కొత్తగా వున్నది స్వర్గమిక్కడే అన్నది
Cast & Crew