1991

కలయా నిజమా

Kalaya Nijama

🎬 Coolie No.1
Advertisement
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా
Advertisement

కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ కలయా నిజమా
లేనిపోని ఏ కూనిరాగమో లేచిరా అంటున్నదీ ఆహా... ఊరుకోని ఏ వెర్రి కోరికో తీర్చవా అంటున్నదీ కోకముళ్ల కూపీ తీసే కైపు చూపు కొరుకుతున్నదీ కుర్రకళ్లు చీరగళ్లలో దారే లేక తిరుగుతున్నవి ముంచే మైకమో మురిపించే మొహమో
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ కలయా నిజమా
చేయి వేయనా సేవ చెయ్యనా ఓయ్ అనే వయ్యారమా హా హా హా పాలముంచిన నీటముంచిన నీ దయే శృంగారమా ఆహా... ఆగలేని ఆకలేవిటో పైకి పైకి దూకుతున్నవి కాలు నేల నిలవకున్నది ఆకాశాన తేలుతున్నది ఆఁ అంతా మాయగా అనిపించే కాలము
కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అణిగున్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలిరేయి హాయి మహిమ
Cast & Crew
🎤SingersIlaiyaraajaP. Susheela
🎵MusicIlaiyaraaja
HeroVenkatesh
💫HeroineTabu
🎬DirectorK. Raghavendra Rao