Advertisement
కిలకిలమనె కళావరు రాణి
ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ
కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ
ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి
చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ
సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ
మదనుడిపాలై పోనీ ముదిరిన భావాలన్నీ
మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ
కిలకిలమనె కళావరు రాణి
ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ
కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ
Advertisement
బరువుగా విరిగెగా కాపు చూపె కద ఏపుగా గోపికా
చొరవగా కరువుగా కాపువేసే కద తేపుగా కోరికా
వాల్లే పరువాలె తగువేలే గనకా
కాలే తమకాలే ఘమకాలై పలుకా
కాంక్షలో సృతీ గతీ పెంచీ కాల్చగా చుట్టూ కట్టే కంచే ఈ మైకం
ఈడులో అతీ గతీ లేనీ దేనికో దిక్కూ మొక్కో పంచే ఈ మాఘం
ఆదమరచిన ఈడులో ఈదలాడనీ
ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి
చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ
సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ
ఒడుపుగా ఒలుచుకో ఓపలేను కద ఒంటిలో అవసరం
చిలిపిగా దులుపుకో మోయలేవు కద నడుములో కలవరం
తాపం తెరతీసీ తరిమేసే తరుణం
కాలం తలుపేసీ విరబూసే సమయం
వీలుగా గుట్టూ మట్టూ మీటీ లీలగా ఎక్కే పుట్టే వేడీ యాడాడో
ఒంటిగా ఉంటే ఒట్టే అంటూ వెంటనే జట్టే కట్టేయాలి ఏనీడో
జోడు బిగిసిన వేడిలో వేగిపోనీ
కిలకిలమనె కళావరు రాణి
ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ
కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ
ఛల్ మోహన్ రంగ సుఖాలకు బోణి
చలిగిలి అన్నీ హొల్లోమనీ పోనీ
సిగ్గేలేని సింగారాన్ని చిందించని చలో హనీ
మదనుడిపాలై పోనీ ముదిరిన భావాలన్నీ
మగజత పాడే బాణీ మగువకు రేవై రానీ
కిలకిలమనె కళావరు రాణి
ఘల్లుఘల్లు మనె కథాకళి కానీ
కలల్లేని కళ్ళలోని కవ్వింతల్ని హలో అనీ