1999

కళకళలు కిలకిలలు

Kala kalalu kila kilalu

🎬 Thammudu
Advertisement
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకికి పెళ్ళి కుదిరినది ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది గల గల కళకళలు కిలకిలలు కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకికి పెళ్ళి కుదిరినది ఈ సందడికి విందులకి ఇల్లు మురిసినది హోయ్
Advertisement

నమ్మలేని లోకం నుంచి మహాలక్ష్మిలాగా అమ్మలేని మా ఇంట్లోకి వదినమ్మ రాకా ఎన్నడైన తన వెనకాలే ఉంటాను కనకా అన్నగారు తననేమన్నా ఉరుకోను ఇంకా నా చిన్ని అల్లర్లన్నీ భరించాలి అంతా ఓర్పుగా
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి
మెట్టినింటి దీపం నీతో వెలగాలి మళ్ళీ కూతురంటి రూపం నీదే నా చిట్టితల్లి ఆశలన్నీ అక్షింతలుగా జరగాలి పెళ్ళీ అందమైన జంటను చూసి మురవాలి తాళి విడిది నేను ఇస్తానంటూ తపించాలి నింగిన జాబిలి
కళకళలు కిలకిలలు కొత్తగ చేరెను మా ఎదగూటికి వెలుతురులు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి