Advertisement
ఎప్పుడైనా నీ రూపం నువ్వు
చూడాలంటె చెప్పమ్మా
అచ్ఛంగా ఇతగాడల్లే వుంటుందమ్మా ఓ ప్రేమ
అన్నింటా నీ తీరే అడుగడుగు నీ జోరే
గుండెల్లో గోదారే పొంగే భావమ
Advertisement
వెంటాడే పరిచయమో
వేటాడే పరిమళమో
మౌనంతో మాటాడే
మంత్రాల మరి మహిమో
అరెరే ఎంత ప్రేమో
అది ఎం పిచ్చి తనమో
పేరైతే వేరైనా ఆ రెండు ఒక్కటేమో
ఎప్పుడైనా నీ రూపం నువ్వు
చూడాలంటె చెప్పమ్మా
అచ్ఛంగ ఇతగాడల్లే వుంటుందమ్మా ఓ ప్రేమ
చినుకంతైనా చిరు చెమట
చెమరుస్తుంటే నా నుదుట
సూర్యుడిని కసిరేస్తాడట
తుప్పర పడిన నాపైన
నా సుకుమారం కందునట
పువ్వులతో కలహిస్తాడట
కలిసొచ్చిన తొలివరమో
కనిపించని కలవరమో
శృతి మించిన రాగములో
ఓ హవనమో
తాను నా కంటి మెరుపొ
కలిగే అధ మరుపో
తనకైనా తెలిసేలా
ఆ దెంత కొంటె తనమో
అరెరే ఎంత ప్రేమో
అది ఎం పిచ్చి తనమో
పేరైతే వేరైనా ఆ రెండు
ఒక్కటేమో