2019

ఎంతో ఫన్

entho fun f2 fun and

🎬 F2: Fun and Frustration
ఎంతో ఫన్
Advertisement
స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోని తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలవాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్
Advertisement

నెమలికి పాటలే నేర్పినట్టు కోయిలమ్మ కొమ్మపై కూచిపూడి ఆడిన్నటు కొత్త కొత్త స్వరములే పుట్టినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్
కాళిదాసు కావ్యము త్యాగరాయ గేయమూ కలిపి మనసు పాడినట్టుగా అందమైన ఊహలు అంతులేని ఆశలు వాకిలంత ఒంపినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్
కళ్ళు కళ్ళు కలుపుకుంటూ కళలు కళలు పంచుకుంటూ కాలమంతా సాగిపోనీ మొహమంతా కరిగిపోతూ విరహమంతా విరిగిపోతూ దూరమంతా చెరిగిపోని
రాతిరంటే కమ్మనైన కౌగిలింత పిలుపుని తెల్లవారులు మేలుకోవడం ఉదయమంటే తియ్యనైన ముద్దు మేలుకొలుపని దొంగలాగా నిద్రపోవడం ఎంతో ఫన్ ఎంతో ఫన్
రోజుకొక్క బొట్టు బిల్లే లెక్కపెడుతూ చిలిపి అద్దం కొంటె నవ్వే నవ్వుతోంది బైటికెళ్లే వేళా నువ్వే పిలిచి ఇచ్చే వలపు ముద్దే ఆయువేదో పెంచుతోందే
ఇంటికెళ్లి వేళా అంటూ మల్లెపూల పరిమళం మత్తు జల్లి గుర్తు చేయడం ఇంటి బైట చిన్నదాని ఎదురు చూపు కళ్ళలో కొత్త ఉత్సవాన్ని నింపడం ఎంతో ఫన్ ఎంతో ఫన్
Cast & Crew
🎤SingersDevi Sri Prasad
✍️LyricsSri Mani
HeroVarun Tej
🎬DirectorAnil Ravipudi