2016

ఆంజనేయుడు

anjaneyudu

🎬 Supreme
ఆంజనేయుడు
Advertisement
ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు
Advertisement

ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటు అవుతాడు తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటిస్తాడు నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు
ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
ఎందుకా కంగారు వొద్దులే బంగారు నిప్పులాంటి ఆశయాన్ని ఆంటదు ఏ కీడు మనసులో కన్నీరు తలచిన తనవారు తరిగిపోయే రగిలిపోయే తోడు నీకున్నాడు
సాయమంటే ఆయువిచ్చే వాయుపుత్రుడు వీడు గుండె గుడిలో నిన్ను కాచే కండ గల మొనగాడు మాట ఇస్తే తప్పని వాడు నిన్ను మనవాడు అనుకున్నాడు నీ కల నెరవేర్చే కర్తవ్యంగా ముందడుగు ఏసాడు
ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
సైన్యము అతడే రా ధైర్యము అతడే రా స్వామి కార్యం మర్చిపోని ధర్మము తనదేరా నీ కన్నులు వెలిగేదాకా తన కంటికి లేదే నిద్దుర జయ హనుమ అనుకో నీ చిరునవ్వుకు హామీ తనప్రేమ ఆహ్
ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు ఆంజనేయుడు నీవాడు నీలోనే వున్నాడు నీవాడై బలమిస్తాడు నీతోడై గెలిపిస్తాడు
Cast & Crew
✍️LyricsRamajogayya Sastry
🎵MusicSai Karthik
💫HeroineRaashii Khanna
🎬DirectorAnil Ravipudi