2026

అలగలగే అలగలగే

Alagalage Alagalage

🎬 Garividi Lakshmi
Advertisement
రాయే రంగుల్లోనా మునుగుతుంది రా నాదం నగిశిలే దిద్దుతుంది రా వనమే కదిలి వసంతం వైపు పరుగెడుతుంది రా సరి కొత్తగతాను పురివిప్పి స్వర పుష్పమాయెరా
Advertisement

అలగలగే అలగలగే అని అడుగే వేసే అటువైపు ఎలగెలగా ఎలగెలగా అని అడిగే ప్రతిదీ తన చూపు
కలలన్నీ ఎదురుగ నిలిచే కళామతల్లే పిలిచే మునుముందు జగమును ఏలే కలముకు మలమేధా దొరికే తనానే తందనానే అందరిలానే కాదంటా తానే మొత్తంగా నెత్తురు లోనే నింపిందంట పాటను పుడుతూనే
అలగలగే అలగలగే అని అడుగే వేసే అటువైపు ఎలగెలగా ఎలగెలగా అని అడిగే ప్రతిదీ తన చూపు
సుతార సుందర నేత్రాలు సుదూర ఆశల ఆత్రాలు శృతిలయలో విని పులకించే తన చెవులు చేతులు గతాన తగిలిన గాయాలు మరింత మాన్పే గేయాలు కదే మార్చి తన కిదే జీవమని చూపే తోవలు
తొలి నడక నడిచే పసిపాదంలా ఉరుకులాట చూడు ఎంత దూరం వెళ్ళునో తన పయనం మొదలైంది ఈనాడు తప్పించుకోదు నిను ఏ గెలుపు శ్రమ ఉంటే నీ తోడు ఉప్పొంగుతున్న ఏ వరదైన చినుకేగా ఒకనాడు మరిచింది వేదనతానే మునిగింది సాధనలోనే ఆటంకముల ఆ అంకమే దాటింది కలతోనే
తనానే తందనానే అందరిలానే కాదంటా తానే మొత్తంగా నెత్తురు లోనే నింపిందంట పాటను పుడుతూనే అలగలగే అలగలగే అని అడుగే వేసే అటువైపు ఎలగెలగా ఎలగెలగా అని అడిగే ప్రతిదీ తన చూపు
ఓ తనలో మొలిసిన తారకనే గగనం పొగిడి గజమాలేస్తే ఇక దీని మించిన దివ్య సంబరం దివి భువిలో లేదే తనలా ఎవరికీ వశపడని ఏక సంతాగ్రహి ప్రతిభే కళ తలుపు తెరిచెనే వెలుగు పరిచెనే అతిశయమే కాదే
ఆ... నేర్చిన కలను గురువు ముందుంచగా ఉరకలు వేసే అణువు అణువు కూర్చెను తనలో పాట సయ్యాట జానపదాన కొత్త నెలవు పండితులే పరవశమొందే ప్రతిభే సహజంగా పొందే ఇక ముందు ముందు జన గుండెలన్నీ ఏ తీరు నేలుతుందే
తనానే తందనానే అందరిలానే కాదంటా తానే మొత్తంగా నెత్తురు లోనే నింపిందంట పాటను పుడుతూనే అలగలగే అలగలగే అని అడుగే వేసే అటువైపు ఎలగెలగా ఎలగెలగా అని అడిగే ప్రతిదీ తన చూపు
Cast & Crew
🎤SingersJaved Ali
✍️LyricsCharan Arjun
🎵MusicCharan Arjun
💫HeroineAnandi
🎬DirectorGauri Naidu Jammu