హే జిమ్మెదారి పటేలో జిమ్మెధారి పటేలా
గల్మకాడ నీకోసం ముగ్గునైతిరో
జిమ్మెదారి పటేలో జిమ్మీ..ధారి పటేలా
నీతోవ్వల నా చూపులు కావాలున్నాయో
Advertisement
అర్రల గుడ్డి దీపమయ్యొందిరా పానం
ఒర్రిన ఇంట లేడు ఏంది పాపం
బుడ్డ పరకాల కూర వండిన నీ కోసం
బుడమట్ల బువ్వతోని తినిపో కొంచెం
ఓ బుజ్జవ్వ మరి సద్ది గట్టుకొని రారాదు
ఎక్కడికో?...
యేశనగుల యేశనగుల యేశనగుల యేశనగుల
యేశ యేశ యేశ యేశ
యేశనగుల కట్టమీద యేశిన ఉయ్యాల
మనం వుగుదమే బాల
యేశనగుల కట్టమీద యేశిన ఉయ్యాల
మనం వుగుదమే బాల
యేశనగుల కట్టమీద యేశనగుల
యేశనగుల కట్టమీద
యేశనగుల కట్టమీద
యేశనగుల కట్టమీద యేశిన ఉయ్యాల
మనం వుగుదమే బాల
యేశనగుల కట్టమీద యేశిన ఉయ్యాల
మనం వుగుదమే బాల...
మొన్న నీ సెమటలు తుడుసుకున్న నా వయీల్ సీర
సింగులే చెక్కంగా సిక్కుల బడేరా
నిన్న నీ వెళ్ళను తల్సుకొని నా జబ్బల రైక
ఉక్కులే ఉత్తిట్టిగా తెగిపోయినయ్ రా
మన గుసా గుసా ముచ్చటంతే గుర్తుకొస్తే రా
చెవి సత్తు కమ్మ మత్తు గమ్మి మొత్తుకుందిరా
నువ్వే బోర్లిపోయిన బొంతనింక సదురలేదురా
ఇయ్యాల రాకపోతే పక్కమీద నేను సత్తరా
ఘుమ ఘుమ నీ వాసన మోసిన నా వొల్లు
ఎన్నడో మరిశిపోయాయే ఎచ్చని నీళ్ళు
గుణ గుణ నువ్వు తిరిగిన నా ఇరుకు ఇల్లు
ఎరుకుంటందిరా నీ ఎంగిలిపూలు
నీ రంది తీర్చనికే నా దగ్గర మందుందే బుజ్జవ్వ
ఏందో అది
దొరల్ తాగే
దొరల్ తాగే
దొరల్ దొరల్ దొరల్ దొరల్ దొరల్
దొరల్ తాగే ఇప్పసారై తాగుడమే బాల
మనం వుగుదమే బాల
దొరల్ దాగే ఇప్పసారై తాగుడమే బాల
మనం వుగుదమే బాల
దొరల్ దాగే ఇప్పసారై దొరల్ దాగే
దొరల్ తాగే ఇప్పసారై
దొరల్ తాగే ఇప్పసారై
యేశనగుల కట్టమీద యేశిన ఉయ్యాల
మనం వుగుదమే బాల
యేశనగుల కట్టమీద యేశిన ఉయ్యాల
మనం వుగుదమే బాల
ఆడే బుజ్జవ్వ దుబ్బ
లేపే బుజ్జవ్వ హేకీంచ్
హేయ్ చుట్టు హేయ్ దాంచి హేయ్ కొట్టు