Advertisement
పచ్చి దీని పేగు సమ్మక్క
గుట్టుకుంటాందే ఆగల్నీ సమ్మక్క
పిచ్చి దీని గుండె సమ్మక్క
కొట్టుకుంటాందే కొడుకుకై సమ్మక్క
Advertisement
కళ్లల కన్నీళ్లు సమ్మక్క
నీ రొమ్ముల గెట్లొచ్చే సమ్మక్క
ఇంకిందే రక్తము సమ్మక్క
పొద్దు గుంకిందే గుడిసెల సమ్మక్క
నడి సేతి సామైతివే...
సమ్మెట పోట్లకు సమ్మక్క
సొమ్మసిల్లిన నిప్పువే సమ్మక్క
సావు చాటుకొచ్చి సమ్మక్క
గాదులు దున్నినవే బతుకును సమ్మక్క...
మృగాల నీ కాళ్లు సమ్మక్క
ముదగారిస్తుంటే గాలాన్ని సమ్మక్క
నీ ఒళ్ళు కొలిమైతే సమ్మక్క
ఆడియాసే నీ బలమైతే సమ్మక్క
నీ పాడే నువ్వు మోస్తివే
సమ్మెట పోట్లకు సమ్మక్క
సావు చాటుకొచ్చి సమ్మక్క
సమ్మెట పోట్లకు సమ్మక్క
సొమ్మసిల్లిన నిప్పువే సమ్మక్క
సావు చాటుకొచ్చి సమ్మక్క
గాదులు దున్నినవే బతుకును సమ్మక్క...