2002

తికమకపెట్టే

Thikamaka pette

🎬 Khadgam
తికమకపెట్టే
Advertisement
తికమకపెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం అలాగ వుంటాం ఇలాగవుంటాం ఆకతాయిలం మేము హే చెప్పేదేదో అర్ధమయ్యేట్టు చెప్పరా అరెభాయ్ ఇస్ర్టెటుగానే చెప్తా ఇసుకో
Advertisement

హే సత్యం పలికే హరిశ్చంద్రులం సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్దం నిత్యంనమాజు పూజలు చేస్తాం రోజూ తన్నుకు చస్తాం హే సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్దం నిత్యంనమాజు పూజలు చేస్తాం రోజూ తన్నుకు చస్తాం నమ్మితే ప్రానాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం అరె ముక్కుసూటిగా వున్నది చెప్తాం నచ్చకుంటే మీ ఖర్మం అరె కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనుసులం
మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరెమేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్
వందనోటు జేబులో వుంటే నవాబునైజం పర్సుఖాళీ అయ్యిందంటే ఫకీరు తత్వం కళ్లులేని ముసలవ్వలకు చెయ్యందిస్తాం పడుచుపోరి ఎదురుగ వస్తే పళికిలిస్తాం
ప్రేమా కావాలంటాం పైసా కావాలంటాం ఏవోకలలేకంటాం తిక్కతిక్కగా వుంటాం ఏడేళ్ళయినా టివి సీరియల్ ఏడుస్తూనే చూస్తాం తోచకపోతే సినిమాకెళ్ళిరికార్డు డాన్సింగ్ చెస్తాం కోర్టు తీర్పుతో మనకేం పనిరా నచ్చినోడికో టేస్తాం అందరుదొంగలే అసలు దొంగకే సీటు అప్పజెప్పిస్తాం
రూలు వుంది రంగూవుంది రూలు వుంది రంగూవుంది తప్పకు తిరిగే లౌక్యం వుంది మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరెమేమే ఇండియన్స్ సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్దం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందేమాతరం
కలలు కన్నీళ్లెన్నో మన కళ్లల్లో ఆశయాలు ఆశలు ఎన్నోమన గుండెల్లో శత్రువుకే ఎదురు నిల్చినా రక్తం మనదీ ద్వేషాన్నే ప్రేమగ మార్చిన దేశం మనదీ
ఈశ్వర్ అల్లా ఏసు ఒకడే కదరా బాసు దేవుడికెందుకు జెండా కవాలా పార్టీఅండా మాతృభూమిలో మంటలు రేపే మాయగాడి కనికట్టు అన్నదమ్ములకు చిచ్చుపెట్టిన లుచ్చగాళ్ల పనిపట్టు భారతీయులం ఒకటేనంటూ పిడికిలెత్తి వెయిఒట్టు కుట్రలు చేసే శత్రుమూకల తోలు తీసి ఆరబెట్టు దమ్మేవొంది ధైర్యంవుంది దమ్మేవొంది ధైర్యంవుంది తలవంచని తెగపొగరుంది
మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరెమేమే ఇండియన్స్
సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్దం హే సత్యం పలికే హరిశ్చంద్రులం అవసరానికో అబద్దం నిత్యంనమాజు పూజలు చేస్తాం రోజూ తన్నుకు చస్తాం నమ్మితే ప్రానాలైనా ఇస్తాం నమ్మడమేరా కష్టం అరె ముక్కుసూటిగా వున్నది చెప్తాం నచ్చకుంటే మీ ఖర్మం అరె కష్టమొచ్చినా కన్నీళ్ళొచ్చినా చెదరని నవ్వుల ఇంద్రధనుసులం
మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ అరెమేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్
Cast & Crew
🎤SingersHoney
✍️LyricsShivashakthi
🎬DirectorKrishna Vamsi