2021

రంగులద్దుకున్నా

Ranguladdhukunna

🎬 Uppena
🎤 Yazin Nizar🎵 Devi Sri Prasad✍️ Sri Mani
Advertisement
జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా
Advertisement

రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం ఆకు చాటునున్నా పచ్చి పిందెలౌదాం మట్టి లోపలున్నా జంట వేరులౌదాం ఎవ్వరీ కంటిచూపు చేరలేని ఎక్కడా మన జంట ఊసురాని చోటునా పద నువ్వు నేనుందాం
జింజిక్ జింజిక్ చా జింజిక్ జింజిక్ చా హ్మ్ హ్మ్ రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం
తేనె పట్టులోనా తీపి గుట్టు ఉందిలే మన జట్టులోనా ప్రేమ గుట్టుగుందిలే వలలు తప్పించుకెళ్ళు మీనాల వైనాల కొంటె కోణాలు తెలుసుకుందాం ఆఆ లోకాల చూపుల్ని ఎట్టా తప్పించుకెళ్ళాలో కొత్త పాఠాలు నేర్చుకుందాం అందరూ ఉన్న చోట ఇద్దరౌదాం ఎవ్వరూ లేని చోట ఒక్కరౌదాం ఏ క్షణం విడివిడిగా లేమందాం
రంగులద్దుకున్నా తెల్ల రంగులౌదాం పూలు కప్పుకున్నా కొమ్మలల్లే ఉందాం
మన ఊసు మోసే గాలిని మూట కడదాం మన జాడ తెలిపే నేలను పాతి పెడదాం చూస్తున్నా సూర్యుని తెచ్చి లాంతర్లో దీపాన్ని చేసి చూరుకేలాడదీద్దాం ఆఆ సాక్ష్యంగా సంద్రాలు ఉంటె దిగుడు బావిలో దాచి మూత పెడదాం నేనిలా నీతో ఉండడం కోసం చేయనీ ఈ చిన్నపాటి మోసం నేరమేం కాదే ఇది మన కోసం
రాయిలోన శిల్పం దాగి ఉండునంటా శిల్పి ఎదురైతే బయటపడునంటా అద్ధమెక్కడున్నా ఆవైపు వెళ్ళకంటా ఆ ఆ నీలో ఉన్నా నేనే బయటపడిపోత ఆఆ పాలలో ఉన్నా నీటిబొట్టులాగా నీళ్లలో దాగి ఉన్నా మెట్టులాగా నీనిలా నీ లోపల దాక్కుంటా
హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్ హైలెస్సా హైలెస్సా హాయ్