2021

ఈశ్వరా పరమేశ్వరా

eshwara parameshwara

🎬 Uppena
ఈశ్వరా పరమేశ్వరా
Advertisement
ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా రెండు కన్నుల మనిషి బతుకును గుండె కన్నుతో చూడరా ఎదుట పడనీ వేదనలను నుదిటి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
Advertisement

దారి ఎదో తీరం ఎదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా చీకటేదో వెలుతురేదో మంచి ఎదో మంట ఎదో లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
నువ్వు రాసిన రాతలిచ్చట మార్చుతూ ఏమార్చుతుంటే నేల పైన వింతలన్నీ నింగి కన్నుతో చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
మసక బారిన కంటి పాపకి ముసుగు తీసే వెలుగు లాగ కాలమడిగిన కఠిన ప్రశ్నకు బదులువై ఎదురవ్వరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా
Cast & Crew
🎤SingersDevi Sri Prasad
✍️LyricsChandrabose
💫HeroineKrithi Shetty
🎬DirectorBuchi Babu Sana