ప్రేమను పంచిన ప్రేమను
ప్రేమను పెంచిన ప్రేమను
ఆశగా కోరదా ప్రతి హృదయం
Advertisement
ప్రేమను పొందటమో వరం
అది అంబరమంటిన సంబరం
ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం
ప్రేమలో ఈ లోకమే సాగే ప్రేమగా
ప్రేమతో ఈ జీవితం ప్రేమించగా
ప్రేమను పంచిన ప్రేమను
ప్రేమను పెంచిన ప్రేమను
ఆశగా కోరదా ప్రతి హృదయం
పసి మదిలో ఏముందో
ముందుగానే తెలిసుంటుంది
అందుకనే ఆ దైవం
జంటగానే నడిపిస్తుంది
మూసి ఉన్న కళ్ళలో ఎన్ని ఆశలో
భాష రాని గుండెలో ఎన్ని ఊసులో
సిరివెన్నెలంటి ఈ స్నేహం
గతజన్మలోని బహుమానం
ఈ జంట చూసి పులకించిపోయి
శతమానమంది లోకం
ప్రేమను పంచిన ప్రేమను
ప్రేమను పెంచిన ప్రేమను
ఆశగా కోరదా ప్రతి హృదయం
ఎవ్వరితో ఎవ్వరికో
ప్రేమ రాత రాసుంటుంది
ఆ మదికీ ఈ మదికీ
బంధమేసి నడిపిస్తుంది
గుప్పెడంత గుండెలో ప్రేమ అన్నది
జ్ఞాపకాల ఊపిరై తాకుతుంటది
ప్రేమించి చూడు ఒకసారి
అది మార్చుతుంది నీ దారి
ఈ ప్రేమలోన ఆకాశమంత
సంతోషముంది లేరా
ప్రేమను పంచిన ప్రేమను
ప్రేమను పెంచిన ప్రేమను
ఆశగా కోరదా ప్రతి హృదయం
ప్రేమను పొందటమో వరం
అది అంబరమంటిన సంబరం
ప్రేమలో తేలుదాం ప్రతి నిమిషం
ప్రేమలో ఈ లోకమే సాగే ప్రేమగా
ప్రేమతో ఈ జీవితం ప్రేమించగా
ప్రేమను పంచిన ప్రేమను
ప్రేమను పెంచిన ప్రేమను
ఆశగా కోరదా ప్రతి హృదయం