2003

పట్టుదలతో

Pattudalato

🎬 Sambaram
Advertisement
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
Advertisement

నీ ధైర్యం తోడై ఉండగ ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా
ఏనాడూ వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
ఇష్టం ఉంటే చేదు కూడా తియ్యనే కష్టం అంటే దూది కూడా భారమే
లక్ష్యమంటూ లేని జన్మే దండగా లక్షలాది మంది లేరా మందగా
పంతం పట్టి పోరాడందే కోరిన వరాలు పొందలేవు కద
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
చేస్తూ ఉంటే ఏ పనైనా సాధ్యమే చూస్తూ ఉంటే రోజులన్నీ శూన్యమే
ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా ఎక్కలేని కొండనేది లేదురా
నవ్వేవాళ్ళు నివ్వెరపోగా దిక్కులు జయించి సాగిపోర మరి
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
నీ ధైర్యం తోడై ఉండగ ఏ సాయం కోసం చూడక నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా
ఏనాడూ వెనకడుగేయక ఏ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుక పోరా సోదరా
పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండ నీదే విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా
Cast & Crew
🎤SingersMallikarjun
✍️LyricsKulasekhar
🎵MusicR.P Patnaik
HeroNithiin
💫HeroineNikitha
🎬DirectorDasaradh