Advertisement
మధురం మధురం ఎపుడూ ప్రేమ
సహజం సహజం ఇలలో ప్రేమ
కళల సీమలో నిజము ఈ ప్రేమ
అనురాగం పలికించే ప్రియ నేస్తం ప్రేమ ప్రేమ
Advertisement
ఎపుడు ఎదకి ఒకటే ధ్యాస
ఎపుడో అపుడు నాదను ఆశ
బదులు కోసమే ఎదురు చూస్తున్న
మదిలోనే కొలువున్న నిను చూసి పలుకే రాదే
వలపు విషము ఒకటేనేమో
మనసు మమతా కలలేనేమో
చిగురుటాశలే చెదిరిపోయేనే
ఎద కోసే ఈ బాధ మిగిలింది ప్రేమ ప్రేమ