2021

ఓబులమ్మా

obulamma konda

🎬 Konda Polam
ఓబులమ్మా
Advertisement
గింజ గింజ గింజమీద బుసుక బుసుక బుసుక తీసి తియ్యంగా బత్తెమై పోయే బొట్టే కట్టి చేతబట్టిన చేతిలోకి చేరాలని గుండుజల్లారాటపడిపోయే
Advertisement

ఓఓ ఓబులమ్మా బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ కపర కపర రేతిరిలోనా కాలమంతా లెక్కలుగట్టి గుండెలోనే నీ పేరు జపమాయే ఇదివరకెపుడూ తెలియని ఎరగని తురుపే మైమరపిస్తూ ఉంటే కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే
కన్నులు కన్నులు వింటున్న చూపులు చూపులు చెబుతున్న మాటల మాటలు చూస్తున్న మగతలలో ఎవ్వరికెవ్వరు సావాసం ఎక్కడికక్కడ ప్రయాణం ఎప్పటికప్పుడు ఎదురయ్యే మలుపులలో
చదివేశాడేమో నా కలలూ ఉంటాడే నీడై రేపవలు తిష్టేసినాడే గోతరాలు పొమ్మంటే పోడే ఈడిగలు
ఓఓ ఓబులమ్మా పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ
కపర కపర రేతిరిలోనా కాలమంతా లెక్కలు తప్పి గుండెలోనే నీ పేరు జపమాయే ఇదివరకెపుడూ తెలియని ఎరగని తలపే మైమరపిస్తూ ఉంటే కంటికేమో కునుకే దూరపు చుట్టమాయే
ఓఓ ఓబులమ్మా బొమ్మకర్ర మేని ఛాయ ముద్దుగుమ్మ ఓఓ ఓబుళమ్మా పుట్టచెండు ఆటల్లోన పూలకొమ్మ
Cast & Crew