2021

ధామ్ ధామ్ ధామ్

dham dham dham konda

🎬 Konda Polam
ధామ్ ధామ్ ధామ్
Advertisement
పచ్చ పచ్చ సెట్టుసేమ పట్టు సీరేలంటా
Advertisement

నల్ల నల్ల ముళ్లకంప నల్ల పూసలాంటా
కిచ కిచలాడే ఉడుత పిచికా లాలిపాటంటా గలగలా పారె సెలలో నీళ్లు సలుబాలంటా అడవి తల్లి ఇంటికొచ్చిన దగ్గరి సుట్టాలం వనలచ్చిమి వొడిలో కట్టాలని గట్టెక్కిచెదం
అడవి తల్లి ఇంటికొచ్చిన దగ్గరి సుట్టాలం వనలచ్చిమి వొడిలో కట్టాలని గట్టెక్కిచెదం
ధామ్ ధామ్ ధామ్ తిరిగేదం ధామ్ ధామ్ ధామ్ దొర్లేదం ధామ్ ధామ్ ధామ్ తిరిగేదం ధామ్ ధామ్ ధామ్ దొర్లేదం
ధామ్ ధామ్ ధామ్ తిరిగేదం ధామ్ ధామ్ ధామ్ దొర్లేదం ధామ్ ధామ్ ధామ్ ధామ్ దయ సుపాలని అడవిని అడగేధం
మన పానాలన్నీ నిలిపే తల్లికి సాగిలపడిపోదం
పొగమంచేమో సాంబ్రానేసి ప్రేమగా తలని నిమిరేనంటా సేథీకి తగిలే పేరు బెరడూ తయాతల్లే తడిమేనంట
మద్దిటెకు ఆకులు మనకు ఇసనా కర్రలు ఇసిరేనంటా హాయ్ హాయ్ హాయ్ గడ్డి గరిక పచ్చిక మనకు పరుపు పరిసి పిలిసినంటా హోం హోం
ధామ్ ధామ్ ధామ్ సుసేధం ధామ్ ధామ్ ధామ్ సుట్టేదం ధామ్ ధామ్ ధామ్ ధామ్ అడవే మనకు కోవెల అనుకుందాం
కోరక ముందే వరాలనిచ్చే తల్లిని కొలిసేధం
సుక్క సుక్క దాచాలంటూ తేనె తీగె తెలిపేనంటా సురుకుంటేనే బతుకుందంటూ దుప్పికడితి సెప్పెనంటా
పెద్దపులితో తలపడు ధైర్నం అడవిపందే నేర్పేనంటా కలిసే ఉంటె బలముందంటూ రేసు కుక్కలు సాటేనంట
పొట్టకూటికి ఏటాడేటి జీవులు సెప్పే పాఠం ఒకటే తిన్న ఇంటిని ధ్వంసం సేసే పాపానికి వోడి కట్టొదంతే
ధామ్ ధామ్ ధామ్ సదివేదం ధామ్ ధామ్ ధామ్ నేర్సేధామ్ ధామ్ ధామ్ ధామ్ ధామ్ ఈ పాఠాలను బతుకున పాటిదం
అడవిని మించిన బడి లేదంటూ అడుగులు కదిపేదం
Cast & Crew