2009

నీతో ఉంటె ఇంకా

Neeto Unte Inka

🎬 Josh
Advertisement
నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
Advertisement

నిన్నిప్పుడు చుస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు గుండెల్లో గువ్వల గుంపై వాలు నీతో అడుగేస్తే చాలు మున్ముందుకు సాగవు కాళ్ళు ఉంటుందా వెనకకి వెళ్లే వీలు
కాలాన్నే తిప్పేసింది లీలా బాల్యాన్ని రప్పించింది వేళా పెద్దరికాలన్నీ చిన్నబోయేలా పొద్దెరగని మలుపేదో పెరిగేలా
నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
నిలబడి చుస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు చిత్రంగా ని వైపల పరుగులు తీస్తాయే లేచి రాళ్ళూ రహదార్లు నీలాగా నలువైపులా
భూమి అంత ని పేరంటానికీ బొమ్మరిల్లు కాదా సమయమంతా ని తారంగానికి సొమ్మశిళ్లిపోదా
చెడైనా తీపావుతుందే ని సంతోషం చూసి చెడు కూడా చెడుతుందే ని సావాసాన్ని చేసి చెడైనా తీపావుతుందే ని సంతోషం చూసి చెడు కూడా చెడుతుందే ని సావాసాన్ని చేసి
నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
ఏ ఓ ఏ ఓ ఏ ఓఓఓ ఆ ఏ ఓ ఏ ఓ ఏ ఓఓఓ ఆ
నువ్వేం చూస్తున్న ఎంతో వింతల్లే అన్ని గమనించే ఆశ్చర్యమా ఏ పని చేస్తున్న ఏదో ఘనకార్యంలాగే గర్వించే పసి ప్రాయమా
చుక్కల్లాన్ని దిగి ని చూపుల్లో కొలువు ఉండి పోగా చీకటన్నదిక రాలేదే ని కంటి పాపా దాకా
ప్రతిపూటా పండుగలాగే ఉంటుందనిపించేలా తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల ప్రతిపూటా పండుగలాగే ఉంటుందనిపించేలా తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల
నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
నిన్నిప్పుడు చుస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు గుండెల్లో గువ్వల గుంపై వాలు
కాలాన్నే తిప్పేసింది లీల బాల్యాన్ని రప్పించింది వేళా పెద్దరికాలన్నీ చిన్నబోయేలా పొద్దెరగని మలుపేదో పెరిగేలా నీతో ఉంటె ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్లు
Cast & Crew
🎤SingersKarthik
💫HeroineKarthika Nair
🎬DirectorVasu Varma