2006

నమహా నమహా

Namahaa namahaa

🎬 10th Class
Advertisement
నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు
Advertisement

నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు
ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గంధాలకు వయ్యారాల నడుంఒంపుకు
కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకు
నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు
నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు
బుగ్గలే చూస్తూ ఉంటె నాలో ఏదో తాపం ప్రాయామే అర్పిస్తోంది దాసోహం
ముద్దుకే మారాం చేసి మొహం రేపే మైకం ఇంతగా వేధిస్తుంది ఈ దేహం
చెలీ చెమటలలో చిలిపి స్నానం
ప్రియా పెదవులతో మధుర గానం
నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు
నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు
ఎప్పుడు చూడలేదు కల్లోనైనా మైనా అందుకే ఆరాటాలు నాలోన
చెప్పనా నీకో మాట నీలో నేనే లేనా ఎందుకు నీలో ఇంత హైరానా
చెలీ కొంటె గాలిలాగా నిన్ను తాకిపోనా
ప్రియా తుంటరీడులోన సిగ్గు మాయమవునా
నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు
నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు
ఊహల్లో వర్ణాలకు ఊరించే అందాలకు ఈ కన్నె గంధాలకు వయ్యారాల నడుంఒంపుకు
కవ్వించే నీ కళ్ళకు బంధించే కౌగిళ్ళకు పదహారేళ్ళ పరువాలకు
నమహా నమహా ఎగసే సొగసా నీలో నిగనిగకు
నమహా నమహా ఊరికే వయసా నీలో తపనలకు
Cast & Crew
🎤SingersHariharanShravani
✍️LyricsKulasekhar
HeroBharath
💫HeroineSaranya , Sunaina
🎬DirectorChandu