2026

జిగితార

jigithara chennai love

🎬 Chennai Love Story
జిగితార
Advertisement
జిగితార జిగితార దిగినావా మనసారా ఆకశాన్ని వీడి ఈ ఆకతాయికై భూమి చేరినావు నా మౌన దేవతై బతకాలనున్నదే ఇక నీకు బానిసై ప్రతి రోజూ నీకిలా సేవ చేయడానికై
Advertisement

జిగితార జిగితార దిగినావా అరె మనసారా
బావిలో ఈదే జీవిలా ఉండగా పువ్వులా తావిలో ముంచి తేల్చావుగా రేవులే లేని నావలే నవ్వగా తోవలో దీవిలా నన్ను చేరావుగా పగలైనా చీకటే నా నిన్నకీ నడిరేయి వేకువే ఈ నేటికీ హరివిల్లువైతివీ నల్ల కాగితానికీ
జిగితార జిగి జిగితార దిగినావా అరె మనసారా
రాత్రిలో రాజ పాటనై మోగుతా తీయని లాలిలో హాయిగా సోలిపో భారతీరాజా చిత్రమై చేరుతా రంగున మాయలో రోజునే మర్చిపో వడివేలై అందుతా నీ వేలుకీ సరదాగా నవ్వుకో ఈ వేళకి సినిమాని మించిన జీవితాన్ని చూపుతా నిలవేణి నిలవేణీ అడగానా ఇన్ములియేనీ
నీకు ఏది వేణుమో ఆర్డరేసుకో నీకు ఎంత పోదుమో అంత వాడుకో కథలన్నీ కంచికే అని అందరందురే కామాక్షి ముందరే స్టార్టయింది నా కథే
Cast & Crew
🎤SingersKarthik
✍️LyricsAnanta Sriram
🎵MusicMani Sharma
💫HeroineSri Gouri Priya
🎬DirectorRavi Namburii