2026

ఇరుముడి కట్టు

irumudi kattu

🎬 Irumudi
ఇరుముడి కట్టు
Advertisement
స్వామియే... శరణం అయ్యప్పా...
Advertisement

పల్లికట్టు శబరిమలైకు కల్లుం ముల్లుం కాలక్కు మెత్తై స్వామియే శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణం
మండల దీక్ష ముగిసింది మాలకు అర్థం తెలిసింది శబరి కొండ పిలిచింది... మణికంఠుని చేరగ పదమంది
కట్టు కట్టూ... హే ఇరుముడి కట్టూ కట్టు కట్టు హే ఇరుముడి కట్టు...
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు (2 times)
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
కొత్తాని కొబ్బరి కాయా అయ్యప్పా వెచ్చాని నెయ్యిని పోసి...అయ్యప్పా కర్పూర ధూపం వేసి - అయ్యప్పా ఇష్టంగా ఇరుముడి కడతాం అయ్యప్పా నువ్వు ఎత్తుకుంటే చాలు ఎన్ని పూనకాలు కంఠమెత్తి పాడుకోగా కన్నె స్వామి కదిలి రాగ
కట్టు కట్టూ... హే ఇరుముడి కట్టూ కట్టు కట్టు హే ఇరుముడి కట్టు...
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
ఎరుమేలి దాటి వస్తాం - అయ్యప్పా పంబలోన మునకే వేస్తాం - అయ్యప్పా అప్పాచ్చి మేడు ఎక్కేస్తాం - అయ్యప్పా ఆపదల్లో ఆదుకో మంటాం - అయ్యప్పా మా చిక్కుముడులన్ని మొక్కుబడులన్నీ చింతలన్నీ మూటకట్టి గురుస్వామి కాళ్ళు మొక్కి
కట్టు కట్టూ... హే ఇరుముడి కట్టూ
కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు కట్టు కట్టు కట్టు కట్టు ఇరుముడి కట్టు ఎక్కు ఎక్కు ఎక్కు ఎక్కు శబరిమల ఎక్కు
స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే
ఇరుముడి కట్టూ శబరిమలైకు
Cast & Crew