2017

ఎంత చిత్రం కదా

entha chitram kada

🎬 Dwaraka
ఎంత చిత్రం కదా
Advertisement
ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఓడిపోయా తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయె తప్పనిసరిగా తిప్పలు వచ్ఛే ప్రేమే వరదాయే ఏ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదాయే
Advertisement

ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఓడిపోయా
కంటి వైపు రానంది కునుకు కత్తి మీద సామైంది బతుకు గుండెల్లోనా పుట్టింది ఒణుకు గొంతు దాటి రానంది పలుకు ఓరి దేవుడో ఇంత కోపమా నాపైన నీకు చెప్పాలంటే అంత సులభమా శక్తినివ్వు నాకు ఇక ఒక్క పూటైనా నేను ఓర్చుకోగలనా ఏదేమైనా ఎదో ఒకటి చెప్పేస్తా తనకు
ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఓడిపోయా
నన్నే గుచ్చ్చిపోయింది సొగసు ఒళ్ళే మరచిపోయింది మనసు ఉన్నట్టుండి లేచింది వయసు ప్రేమో పిచ్చొ నాకేమి తెలుసు ఎంత ఆపినా ఆగనంది దూకే అడుగు ఎంత దూరమో తెలియకున్నది తుళ్ళే పరుగు తన తీరమేదైనా ఏ దారిలోనైనా చేరే వరకు అలుపే లేదు పట్టేస్తా తుదకు
ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఓడిపోయా
తప్పు ఒప్పు ఆలోచించే వీలే లేదాయె తప్పనిసరిగా తిప్పలు వచ్ఛే ప్రేమే వరదాయే ఏ ముప్పును తప్పుకుపోయే వేరే దారి కనపడదాయే
ఎంత చిత్రం కదా ఒక చూపుకే ఒరిగిపోయా ఎంత ఘోరం కదా ఒక నవ్వుకే ఓడిపోయా
Cast & Crew
✍️LyricsRehaman
🎵MusicSai Karthik
💫HeroinePooja Jhaveri
🎬DirectorSrinivas Ravindra