2011

దీవాలి దీపాన్ని

Diwali Deepaanni

🎬 Dhada
Advertisement
చక్కర చిన్నోడా అలె కథేరా కల్లోడా అలె చూడరా బుల్లోడా అలె అందాన్ని ఒంటరి పిల్లోడా అలె తుంటరి పిల్లోడా అలె వద్దకు లాగేయ్ ర అలె వజ్రాన్ని
Advertisement

దీవాలి దీపాన్ని సామ్రాన్ని ధూపాన్ని నీ కళ్ళలోన ఆకళ్ళు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని
చక్కర చిన్నోడా అలె కథేరా కల్లోడా అలె చూడరా బుల్లోడా అలె అందాన్ని
ఊరించే నిషా ని ఊపిరి పొసే విషాన్ని నెత్తురు లోతుకు హత్తుకు పోయిన స్నేహాన్ని అత్తరు పూసిన బాణాన్ని అల్లాడిస్తా ప్రాణాన్ని అల్లుకుపోరా కాముడు రాసిన గ్రంధాన్ని
చక్కర చిన్నోడా అలె కథేరా కల్లోడా అలె చూడరా బుల్లోడా అలె అందాన్ని
కదిలే నావల వయసే ఊయల ఎదుటే నువ్వలా గిచ్చే కన్నై చూస్తుంటే నిజామా ఈ కల అనిపించేంతలా మనసే గువ్వల గాల్లో తేలిందే
నీ పక్క చోటిస్తే నన్నే నా నుంచి దోచిస్తా నాకే నీ లోన చోటిస్తే నన్నే దాచేస్తా ఒహ్హ్ నీ గూడు నాకిస్తే ఇంకా న గుండె నీకిస్తా నీతో వెయ్యేళ్ళు రాణిస్తే నన్నే రసిస్త
దీవాలి దీపాన్ని సామ్రాన్ని ధూపాన్ని నీ కళ్ళలోన ఆకళ్ళు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని
ఒక్కడే వేయి గ కదిలే మాయ గ కనిపించావుగా అటు ఇటు నా చుట్టూ సల సల హాయి గ సరసన రాయి గ కదిలించావుగా ప్రాయం పొంగేట్టు
ముందుకు వస్తావో నాతో పొత్తుకు వస్తావో ఎటో ఎత్తుకు పోతావో అంత నీ ఇష్టం ఉప్పెన తెస్తావో నొప్పిని ఒప్పనిపిస్తావో తప్పని తప్పును చేస్తావో అందం నీ సొంతం
దీవాలి దీపాన్ని సామ్రాన్ని ధూపాన్ని నీ కళ్ళలోన ఆకళ్ళు పెంచే రూపాన్ని బంధించే దారాన్ని తీపనిపించే కారాన్ని ఎన్నటికైనా నిన్నే కోరే నీ దాన్ని
Cast & Crew
✍️LyricsRamajogayya Sastry
💫HeroineKajal Aggarwal
🎬DirectorAjay Bhuyan