2021

అడిగా అడిగా

adigaa adigaa

🎬 Akhanda
అడిగా అడిగా
Advertisement
అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా చిన్న నవ్వే రువ్వి మార్చేసావే నా తీరు నీ పేరుగా చూపు నాకే చుట్టి కట్టేసావే నన్నేమో సన్నాయిగా
Advertisement

కదిలే కలలే కన్నా వాకిళ్ళలో కొత్తగా కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా
అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా
సరిలేని సమారాలు సరిపోని సమయాలు తొలిసారి చూసాను నీతో వీడిపోని విరహాలు వీడలేని కలహాలు తెలిపాయి నీ ప్రేమ నాతో
ఎల్లలేవి లేని ప్రేమే నీకే ఇచ్చానులే నేస్తమా వెళ్లలేని నేనే నిన్నే ధాటి నూరేళ్ళ నా సొంతమా
కనని వినని సుప్రభాతల సావసమా సెలవే కోరని సిగ్గు లోగిళ్ల శ్రీమంతమ
అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ వాడిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా
సింధూర వర్ణాల చిరునవ్వు హారాలు కలబోసి కదిలాయి నాతో మనిషేమో సెలయేరు మనసేమో బంగారు సరిపోవు నూరేళ్లు నీతో
ఇన్ని నాళ్ళు లేనే లేదే నాలో నాకింత సంతోషమే మల్లి జన్మే ఉంటె కావాలంట నీ చెంత ఏకాంతమే
కదిలే కలలే కన్నా వాకిళ్ళలో కొత్తగా కౌగిలే ఓ సగం పొలమారిందిలే వింతగా
అడిగా అడిగా పంచ ప్రాణాలు నీ రాణిగా జతగా జతగా పంచు నీ ప్రేమ పారాణిగా
Cast & Crew
🎤SingersS. P. CharanM.L Sruthi
🎵MusicThaman S
💫HeroinePragya Jaiswal
🎬DirectorBoyapati Srinu