2002

ఎవ్వరు ఏమన్నా

Yevaru emanna

🎬 Jayam
Advertisement
ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ
Advertisement

కాలమొస్తే సిరిమల్లె తీగకి చిగురే పుడుతుంది ఈడు వస్తే ఈ పడుచు గుండెలో ప్రేమే పుడుతుంది గొడుగు అడ్డుపెట్టినంతనే వాన జల్లు ఆగిపోవునా గులకరాయి వేసినంతనే వరద జోరు ఆగిపోవునా ఏడు లోకాలు ఏకం అయినా ప్రేమను ఆపేనా
ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ
ప్రేమ అంటే ఆ దేవుడిచ్చిన చక్కని వరమంట ప్రేమ ఉంటే ఈ మనసుకెప్పుడూ అలుపే రాదంట కండలెంత పెంచుకొచ్చినా కొండనెత్తి దించలేరుగా కక్షతోటి కాలు దువ్వినా ప్రేమనెవ్వరాపలేరుగా ప్రేమకెపుడైనా జయమే కానీ ఓటమి లేదంట
ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ ఎవరూ రాకున్నా ఆగదు ఈ ప్రేమ నెత్తుటి కత్తికి ఏనాడూ లొంగదు ఈ ప్రేమ మెత్తని మనసును ఏ రోజు వీడదు ఈ ప్రేమ కులము మతము లేవంటుంది మనసుకి ఈ ప్రేమ నింగీ నేల ఉన్నన్నాళ్ళు ఉంటుందీ ప్రేమ శాశ్వతమీ ప్రేమ
Cast & Crew
🎤SingersR.P PatnaikUsha
✍️LyricsKulasekhar
🎵MusicR.P Patnaik
💫HeroineSadha
🎬DirectorTeja