1991

వానా వానా వెల్లువాయే

vaana vaana velluvaye gang

🎬 Gang Leader
వానా వానా వెల్లువాయే
Advertisement
వానా వానా వెల్లువాయే కొండా కోనా తుళ్ళిపోయే
Advertisement

చెలియ చూపులే చిలిపి ఝల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి
వానా వానా వెల్లువాయే కొండా కోనా తుళ్ళిపోయే
ప్రియుని శ్వాసలే పిల్ల గాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి
చక్కని చెక్కిలి చిందే అందపు గంధం పక్కన చేరిన మగ మహారాజుకి సొంతం
హో తొలకరి చిటపట చినుకులలో మకరందం చిత్తడి పుత్తడి నేలకదే ఆనందం
చిగురుటాకులా చలికి వణుకుతూ చెలియా చేరగా ఏదో ఏదో ఏదో హాయి
వానా వానా వెల్లువాయే కొండా కోనా తుళ్ళిపోయే
ఒకరికి ఒకరై హత్తుకు పోయిన వేళా వొడిలో రేగెను ఏదో తెలియని జ్వాలా
ముసిరిన చీకటిలో చిరుగాలుల గోలా బిగిసిన కౌగిట కరిగించెను పరువాల
కలవరింతలే పలకరింపులై పదును మీరగా ఏదో ఏదో ఏదో హాయి
వానా వానా వెల్లువాయే కొండా కోనా తుళ్ళిపోయే
చెలియా చూపులే చిలిపి ఝల్లులై మేను తాకగా ఏదో ఏదో ఏదో హాయి
వానా వానా వెల్లువాయే కొండా కోనా తుళ్ళిపోయే
ప్రియుని శ్వాసలే పిల్ల గాలులై మోము తాకగా ఏదో ఏదో ఏదో హాయి
లాలాలాల లాలాలాల హా లాలాలాల లాలాలాల హూ లాలాలాల లాలాలాల
Cast & Crew
✍️LyricsBhuvanachandra
🎵MusicBappi Lahari
💫HeroineVijayashanti
🎬DirectorVijaya Bapineedu