2014

తంజావూరు

tanjavuru

🎬 Legend
తంజావూరు
Advertisement
సీతారాముల జంటల్లే రాధాకృష్ణుల ప్రేమల్లె గౌరీ శంకరులల్లే మీరు ఒకటవ్వాలి నింగినీలం రంగాళ్లే వెలుగు దీపానికి మల్లె పాలు తేనె ఆలూమగలై కలిసుండాలి
Advertisement

హే పట్టు చీర బాగుందే కట్టు బొట్టు బాగుందే చుట్టుముట్టే తెలుగందంలో అయస్కాంతం లాగిందే హే పైట చెంగు బాగుందే పిట్టా నడుం బాగుందే కుచ్చిళ్లలో కులుకే చూసి నా గుండె ఆగిందే హోం నీ కోసంగా పుట్టిన అందం నీదే కావలి నీ చూపుల్తో ఎదిగిన చందం నీకే ఇవ్వాలి ఇంద అంటూ నువ్విస్తుంటే ఇంకేం కావాలి నీ ఇంగువ సొగసుల ఘుమ ఘుమ చూసి వచ్చా నోరూరి తంజావూరు బొమ్మల్లె భలే ముద్దొస్తున్నవే మనసే మడతేసి మాయాజాలం చేసావే హే అత్తాపూర్ అత్తరు నాపై చల్లేస్తున్నవే వయసే విరబూసే వడగాలై వచ్చేసావే
నీటిలో కాగితం పడవల దూసుకొస్తుందే ఆశ నీవైపే నడుంఓంపులో ఒదిగే కడవలా వాలి పోయావే పిలిచేలోపే ఓయ్ గుండె సడి గుఱ్ఱంలాగా దూకింది నీపైకే కళ్లెం వదిలేసా నీకే కావాలనే హొయ్ గట్టు తెగి తూఫానయ్యె కథలంటే నువ్వేలే అదుపు దాటి ఆక్రమించు అస్సలు ఆపాను నిన్నే తంజావూరు బొమ్మల్లె భలే ముద్దొస్తున్నవే మనసే మడతేసి మాయాజాలం చేసావే హే అత్తాపూర్ అత్తరు నాపై చల్లేస్తున్నవే వయసే విరబూసే వడగాలై వచ్చేసావే
ఎండలో నట్ట నడి ఎండలో కాలు మోపొద్దే కంది పోయేలా నీడలో నన్ను నీ నీడలో దాచుకున్నాక నాకు భయమేల అర్రే రాతిరి గంతలు కట్టి నలుపంతా దోచేసి కాటుకలు దిద్దేస్తానే నీ కళ్ళకి హే సూర్యుడికి ముసుగే వేసి దూరంగా గిరవాటేసి కాలమంతా గడుపుకుంటా నీ వెలుగులో పడకేసి తంజావూరు బొమ్మల్లె భలే ముద్దొస్తున్నవే మనసే మడతేసి మాయాజాలం చేసావే హే అత్తాపూర్ అత్తరు నాపై చల్లేస్తున్నవే వయసే విరబూసే వడగాలై వచ్చేసావే
Cast & Crew
🎤SingersSooraj SanthoshHarini
✍️LyricsRamajogayya Sastry
🎬DirectorBoyapati Srinu