Advertisement
సుస్వాగతం నవరాగమ పలికిందిలే ఎద సరిగమ
ప్రియా దరహాసమా ప్రేమ ఇతిహాసమా
నీ తోలి స్పర్శలో ఇంత సుఖ మైకమ
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా
ఆ ఆ ఆ పనిసగా నినిస
ఆ ఆ ఆ పనిసగా నినిస
Advertisement
పిందల్లే రాలె పువ్వ చిన్నిచిన్ని నవ్వులివ్వ
నీకోసం ప్రాణం పెట్టె చిన్నవాడి చేరువ
సుస్వాగతం నవరాగమ
అంతెలేని వేగంతోనే ప్రేమే వస్తుంటే
నేను ఆనకట్ట వేయలేని ఆహ్వానిస్తుంటే
పట్టే తప్పే విరహంలోని మునిగి పోతుంటే
ఇంకా క్షేమంగానే జీవిస్తా నీ చేయందిస్తుంటే
ఆ చేతులే నీకు పూలదండగా మెడలోన వేసి నీ జత చేరగా
నా చూపు సూత్రంగా ముడిపడగా నాజూకు చిత్రాల రాజ్యమేలాగా
మౌనమే మాని గానమై పలికే నా భావన
ఆ ఆ ఆ పనిసగా నినిస
ఆ ఆ ఆ పనిసగా నినిస
శిలలాంటి గుండె కాస్త శిల్పమల్లె మారిపోయే
చిత్రాల ప్రేమ దాచే సంధ్యవేళ వేళలో
సుస్వాగతం నవరాగమ
సూరీడున్నాడమ్మా నిన్నే చూపడానికి
రేయి ఉన్నదమ్మా కలలో నిన్నే చేరడానికి
మాట మనసు సిద్ధం నీకే ఇవ్వడానికి
నా కళ్ళు పెదవి ఉన్నాయ్ నీతో నవ్వడానికి
ఏనాడూ చూశాను రూపురేఖలు ఆనాడే రాశాను చూపులేఖలూ
ఏరోజు లేదమ్మా ఇన్ని వింతలూ ఈవేళ నా ముందు ప్రేమ పుంతలు
ఏడూ వింతలను మించే వింత మన ప్రేమే సుమ
ఆ ఆ ఆ పనిసగా నినిస
ఆ ఆ ఆ పనిసగా నినిస
వచ్చింది పూల మాసం చిన్న వాడి ప్రేమకోసం
అందాల నీలాకాశం అందచందా సంబరం
సుస్వాగతం నవరాగమ పలికిందిలే ఎద సరిగమ
ప్రియా దరహాసమా ప్రేమ ఇతిహాసమా
నీ తోలి స్పర్శలో ఇంత సుఖ మైకమ
ఇది ప్రణయాలు చిగురించు శుభతరుణమా
సుస్వాగతం నవరాగమ