2004

పూల ఘుమ ఘుమ

Poola Ghuma ghuma

🎬 Sri Anjaneyam
Advertisement
పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఉంటె ఎలా తేనే మధురిమా చేదని ఆ మూతి ముడుపెంటలా
Advertisement

ప్రేమంటే పామని బెదరాలా ధీమాగా తిరగర మగరాయడా బామంటే చూడని వ్రతమెలా పంతాలే చాలురా ప్రవరాఖ్యుడ
మారనే మారవా మారనే మానవ మౌనివా మానువా తేల్చుకో మానవా
పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఉంటె ఎలా తేనే మధురిమా చేదని ఆ మూతి ముడుపెంటలా
చెలి తీగకి ఆధారమై బంధమై అల్లుకో దరికొచ్చ్చి అరవిఛ్చి అరవిందమై అందమే అందుకో మునిపంటితో నా పెదవిపై మల్లెలే తుంచుకో నా వాలు జడ చుట్టుకొని మొగిలి రేఖ నడుము నడిపించుకో
వయసులో పరవశం చూపుగా చేసుకో సొగసులో పరిమళం శ్వాసగా తీసుకో
పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఉంటె ఎలా తేనే మధురిమా చేదని ఆ మూతి ముడుపెంటలా
ప్రతి ముద్దుతో ఉదయించని కొత్త పున్నాగనై జాతళీలలో అలసి మత్తెక్కిపోని నిద్రగన్నేరునై నీ గుండెపై ఒదిగుండని పొగడ పూదండనై నీ కంటి కోనేటి కొలువుంది పోనియ్ చెలిమి చెంగల్వనై
మోజులే జాజులై పోయానికి హాయిని తాపమే తుమ్మెదై తీయని తేనెని
పూల ఘుమ ఘుమ చేరని ఓ మూల ఉంటె ఎలా తేనే మధురిమా చేదని ఆ మూతి ముడుపెంటలా
Cast & Crew
🎤SingersShreya Ghoshal
🎵MusicMani Sharma
💫HeroineCharmme Kaur
🎬DirectorKrishna Vamsi