2019

ఫిర్ షురూ

phir shuru

🎬 Maharshi
ఫిర్ షురూ
Advertisement
ఎగసిపడే కెరటాన్నే ఆపేనా ఎవడైనా మెరిసిపడే పిడుగులనే ఆపేనా ఎవడైనా
Advertisement

చదరంగంలో చాణక్యుడికే ఓటమి ఉందా ఏనాడైనా ఎదురడుగేసే ఆలోచనకే వెనకడుగుందా ఎన్నటికైనా సుడిగాలిని కోసి దారిని తీసి దూకెయ్ బాణంలా
ఫిర్ షురూ చల్ గురు ఫిర్ షురూ చల్ గురు
వెలుగక్కడ లేదని చెప్పే మాటేరా చీకటి అంటే నిశి అన్నది లేనేలేదే ఆరాటం తోడై ఉంటే పోరాటం మరి నీ వెంటే ఓటమికే చోటే లేదే చినుకుల నడుమన తడవక సాగే అర్జున వేగం క్షణమాగేనా నిలబడి పోరే నిలకడ తీరే గెలుపని చాటేలా
ఫిర్ షురూ చల్ గురు ఫిర్ షురూ చల్ గురు
మిణుగురు పురుగులు అణువంతైనా అడవిని సైతం వెలిగించెయవా చలి చీమలు చిరు చిగురంతైనా వనసర్పమునే గెలిచెయవా చుక్కలు రేణువులంతే ఉన్నా నింగిన రంగులు పొంగించెయవా రెక్కలు ఇంతే పిసరంతైనా దిక్కులనే శాసించెయవా
కొమ్మల చాటున కోయిల పాటే వేకువ బాటకు పిలుపే కాదా నీ పిడికిలిలోని అలికిడి జగతికి మెలకువ పాఠంలా
ఫిర్ షురూ చల్ గురు ఫిర్ షురూ చల్ గురు ఫిర్ షురూ చల్ గురు ఫిర్ షురూ చల్ గురు
Cast & Crew
🎤SingersBenny Dayal
✍️LyricsSri Mani
💫HeroinePooja Hegde
🎬DirectorVamshi Paidipally