2021

నీ చిత్రం చూసి

Nee Chitram Choosi

🎬 Love Story
Advertisement
నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో ఓ ఓ ఓఓ ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో ఓ ఓ ఓఓ
Advertisement

నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి నే చిత్తరువైతిరయ్యో ఇంచు ఇంచులోన పొంచి ఉన్న ఈడు నిన్నే ఎంచుకుందిరయ్యో నా ఇంటి ముందు రోజు వేసే ముగ్గు నీ గుండె మీదనే వేసుకుందు నూరేళ్లు ఆ చోటు నాకే ఇవ్వురయ్యో
ఈ దారిలోని గందరగోళాలే మంగళ వాయిద్యాలుగా చుట్టూ వినిపిస్తున్న ఈ అల్లరులేవో మన పెళ్ళీ మంత్రాలుగా అటు వైపు నీవు నీ వైపు నేను వేసేటి అడుగులే ఏడు అడుగులని ఏడు జన్మలకి ఏకమై పోదామా ఆ ఆఆ
ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా నిన్ను నాలో దాచి నన్ను నీలో విడిచి వెళ్లి పొమ్మంటుంది ప్రేమా ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆఆ ర రా ఆఆ ఆఆ
ఈ కాలం కన్న ఒక క్షణం ముందే నే గెలిచి వస్తానని నీలి మేఘాన్ని పల్లకీగా మలిచి నిను ఊరేగిస్తానని ఆకాశమంత మన ప్రేమలోని ఏ చీకటైన క్షణకాలమంటు నీ నుదుట తిలకమై నిలిచిపోవాలని ఎంత చిత్రం ప్రేమ వింత వీలునామ రాసింది మనకు ప్రేమా ఆ ఆ ఆఆ
Cast & Crew
🎤SingersAnurag Kulkarni
🎵MusicPawan CH
💫HeroineSai Pallavi
🎬DirectorSekhar Kammula