2021

ఏవో ఏవో కలలే

Evo Evo Kalale

🎬 Love Story
Advertisement
ఏవో ఏవో కలలే ఎన్నో ఎన్నో తెరలే అన్ని దాటి మనసే హే ఎగిరిందే నన్నే నేనే గెలిచే క్షణాలివే కనుకే పాదాలకే అదుపే హే హే లేదందే
Advertisement

రమ్ పమ్ తర రమ్ పమ్ తర రమ్ పమ్ ఎదలో రమ్ పమ్ తర రమ్ పమ్ తర రమ్ పమ్ కథలో
ఏంటో కొత్త కొత్త రెక్కలొచ్చినట్టు ఏంటో గగనంలో తిరిగా ఏంటో కొత్త కొత్త ఊపిరందినట్టు ఏంటో తమకంలో మునిగా ఇన్నాళ్ళకి వచ్చింది విడుదల గుండెసడి పాడింది కిలకిల పూలాతడి మెరిసింది మిలమిల కంటీతడి నవ్వింది గలగల
ఊహించలేదసలే ఊగిందిలే మనసే పరాకులో ఇపుడే హే హే పడుతోందే అరే అరే అరెరే ఇలా ఎలా జరిగే సంతోషమే చినుకై దూకిందే
రమ్ పమ్ తర రమ్ పమ్ తర రమ్ పమ్ ఎదలో రమ్ పమ్ తర రమ్ పమ్ తర రమ్ పమ్ కథలో
ఏంటో కల్లల్లోన ప్రేమ ఉత్తరాలు ఏంటో అసలెప్పుడు కనలే ఏంటో గుండెచాటు ఇన్ని సిత్తరాలు ఏంటో ఎదురెప్పుడు అవలే నీతో ఇలా ఒక్కొక్క క్షణముని దాచెయ్యనా ఒక్కొక్క వరమని నీతో ఇలా ఒక్కొక్క ఋతువుని పోగెయ్యనా ఒక్కొక్క గురుతుని
ఇటువైపో అటువైపో ఎటువైపో మనకే తెలియని వైపు కాసేపు విహరిద్దాం చల్ రే హో హో
ఏంటో మౌనమంత మూత విప్పినట్టు ఏంటో సరిగమలే పాడే ఏంటో వానవిల్లు గజ్జకట్టినట్టు ఏంటో కథకళినే ఆడే గాల్లోకిలా విసరాలి గొడుగులు మన స్వేచ్ఛకి వెయ్యొద్దు తొడుగులు సరిహద్దులే దాటాలి అడుగులు మన జోరుకి అదరాలి పిడుగులు
ఏంటో హల్లిబిల్లి హాయి మంతనాలు ఏంటో మన మధ్యన జరిగే ఏంటో చిన్న చిన్న చిలిపి తందనాలు ఏంటో వెయ్యింతలు పెరిగే ఏంటో ఆశలన్నీ పూసగుచ్చడాలు ఏంటో ముందెప్పుడు లేదే ఏంటో ధ్యాస కూడా దారి తప్పడాలు ఏంటో గమ్మత్తుగా ఉందే
Cast & Crew
✍️LyricsBhaskarabhatla
🎵MusicPawan CH
💫HeroineSai Pallavi
🎬DirectorSekhar Kammula