2024

నానా హైరానా

naanaa hyraanaa game

🎬 Game Changer
నానా హైరానా
Advertisement
నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా థిల్లానా దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా థిల్లానా దిన్నా
Advertisement

నానా హైరానా ప్రియమైన హైరానా మొదలాయే నాలోనా లలనా నీ వలనా
నానా హైరానా అరుదైన హైరానా నెమలీకల పులకింతై నా చెంపలు నిమిరేనా
దానాదీనా ఈవేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా
వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోన్నవుతున్నా మరికొంచెం... నువ్వు నా పక్కన ఉంటే...
నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా థిల్లానా దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా థిల్లానా దిన్నా
ఎపుడు లేనే లేని వింతలు ఇపుడే చూస్తున్నా గగనాలన్ని పూలగొడుగులు భువనాలన్నీ పాల మడుగులు
కదిలే రంగుల భంగిమలై కనువిందాయెను పవనములు
ఎవరు లేనే లేని దీవులు నీకు నాకేనా
రోమాలన్ని నేడు మన ప్రేమకు జెండాలాయే ఏమ్మాయో మరి ఏమో నరనరము నైలు నదాయే
తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమల్లో అనగనగా సమయములో తొలి కథగా
వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంల వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే
వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోన్నవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే
నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా థిల్లానా దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా నాదిర్ దిన్నా థిల్లానా దిన్నా...
Cast & Crew
🎤SingersShreya Ghoshal ,  Karthik
✍️LyricsRamajogayya Sastry
🎵MusicThaman S
⭐HeroRam Charan
💫HeroineKiara Advani
🎬DirectorS. Shankar