2005

మగవాడ మతిపోయెరా

Mogavada Mathi Poyara

🎬 Allari Bullodu
Advertisement
మగవాడ మతిపోయెరా మనసంతా నీవాయరా ఒకటోసారి కోపించా రెండోసారి తపించా వేరోసారి వేదించా మరివో సారి మోహించా మొత్తం మీద నిన్నే ప్రేమించా
Advertisement

మగవాడ మతిపోయెరా మనమాడే ఆటుందిరా
పోకిరోడు నేడు కాదు ప్రయోజకుడుగా మారగా అల్లరోడు నేడు నను అల్లే తోడు అనిపించగా
అమాయకుడు వీడు అమ్మాయి కుడిగా మారగా
నెమ్మదస్తు డొకడు బహు జబర్దస్తుడిగా చేరగా అయ్యింది ముఖపరిచయం ఇక అవ్వాలి సుఖపరిచయం చూపుల్లో తొలి పరిచయం ఇది వలపుల్లో బల పరిచయం నా పైకి లంఘించరా రారా నియమాలే ఉల్లంఘించరా
మగవాడ మతిపోయెరా మనసంతా నీవాయరా
నిప్పులేని మంట మరి పుట్టించింది నువ్వే కడట్ మబ్బు లేని వాన కురిపించాల్సింది నీ బాధ్యత
నేలలేని పంట అది పండించింది నువ్వే కదా కూలీ లేని పనిలో శ్రమ పడాల్సింది నేనే సదా
రావాలి ఆ యోగమే అది ఇరువురికి ఉపయోగమే అందాల ఆరోహణే ఇది విరహాల అవరోహణే ఎంతెంతో ఆశించారా చేతుల్తో సంభాసించరా
చినదాన చిటికేయనా చిటికేసి చెలరేగనా
Cast & Crew
🎤SingersTippu ,  Swetha Pandit
✍️LyricsChandrabose
⭐HeroNithiin
💫HeroineTrisha Krishnan , Rathi
🎬DirectorK. Raghavendra Rao