2010

మందార పువ్వల్లె

mandaara poovalle

🎬 Awara
మందార పువ్వల్లె
Advertisement
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి యదలో ఎంతున్నా ఒక మాటే రాదే నా కళ్ళల్లోన అరె కలలే రావే పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
Advertisement

మదిలో మౌనం రగిలే వేళ కొంచెం మోహం దాహం చుట్టివేసెనే తొలిచూపే విరి తూర్పై యద తలుపుని మెరుపల్లె తట్టివేసెనే అద్దాన్ని సరిచేసి మనసంతా కళ్ళల్లో పొదిగానే పొదిగానే పిల్లా నే నీ ముద్దు మురిపాల వలపుల్లో తడిసానే తడిసానే పురి విప్పే మేఘాన్నై ఒడిలో తారగ నిను తలిచా వేసవిలో వెల్లువనై బుగ్గలు తాకి యద మరిచా
పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
అలలాగా కుదిపేసే తన పేరుని వింటే పరిమళమే కలలోనే కనిపించే తన నగవులు కంటే పరవశమే ఏనాటి ఊసుల్నో ఏనాటి బాసల్నో వింటున్నా వింటున్నా ఆగంటు నిలదీసే రహదారి దీపాన్నై నిలుచున్నా వెలిగున్నా మది తొలిచే పాటలకి అర్ధాలే నీవని మురిసితినే ఒక నదిలా నీవొస్తే బాగా దూరం తరిగెనులే
నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి యదలో ఎంతున్నా ఒక మాటే రాదే నా కళ్ళల్లోన అరె కలలే రావే పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
Cast & Crew
🎤SingersBenny Dayal
✍️LyricsBhuvanachandra
HeroKarthi
💫HeroineTamannaah Bhatia
🎬DirectorN. Lingusamy