మనసులే కలిసెలే
Advertisement
మౌనమే మౌనమే
మనసు లో మిగిలెనే
నిన్నిలా చేరగా
మంచులా కరిగెనే
ఎక్కడున్నావే ఎక్కడున్నావే
ఇప్పుడొచ్చావే
నిన్ను కన్నుల్లో కంటి పాపల్లే
దాచుకుంటాలే
మనసులే మనసులే
కలిసెలే
నీకోసం కలగన్నా
కలలోన నిను కన్నా
ఎడబాటు ఎదురైనా
నీ నీడై వస్తున్నా
ఎదలో ఎదలో
ఎదలో ఎపుడో
అతిదై వల వేసావే
కలవో అలవో
వలపై ముంచేసావే
నీ ప్రేమ మైకం
ప్రవహించే లోన
నీ ఊహల దాహం
శృతి మించే లోలోన
వేచి వేచి కలలే మిగిలే
దాచి దాచి ఉంచా
చూసి చూసి వయసే రగిలి
చేరి పంచుకుందాం
జతగా జతగా
ముద్దు ముద్దు ముద్దు చేసి
గుండెల్లోనా చిరు మంటేసి
ముద్దు ముద్దు ముద్దు చేసి
గుండెల్లోనా చిరు మంటేసి
ఎక్కడున్నావే ఎక్కడున్నావే
ఇప్పుడొచ్చావ్వే
నిన్ను కన్నుల్లో కంటి పాపల్లే
దాచుకుంటాలే
చిరు చెమటలు తడిమేసి
నన్ను చుట్టుకో తడిమేసి
మదిలో మదిలో మదిలో
మదిలో హృదిలో
ఏదో చేసేసావే
వలపు తలపు
నాలో నింపేసావే
విరహాల రాగం
వినిపించే లోనా
నీ మోహావేశం లయ
పెంచే లో లోనా
బిగిసి బిగిసి క్షణమే యుగమై
నన్ను చుట్టుకున్న
ఎగసి ఎగసి నిశిలో ససినై
నిన్ను చేరుకున్న
జతగా జతగా
మత్తు మత్తు మత్తు చల్లి
చిత్తూ చిత్తూ చిత్తూ చేసి
మత్తు మత్తు మత్తు చల్లి
చిత్తూ చిత్తూ చిత్తూ చేసి
ఎక్కడున్నావే ఎక్కడున్నావే
ఇప్పుడొచ్చావ్వే
నిన్ను కన్నుల్లో కంటి పాపల్లే
దాచుకుంటాలే