2000

మనసేమో చెప్పిన

manasemo cheppina

🎬 Yuvaraju
మనసేమో చెప్పిన
Advertisement
మనసేమో చెప్పిన మాటే వినదు అది ఏమో ఇవాళ పెదవుల్లో దాచినదసలే అనదు అనరాని నిజాలా ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో ఆ కళ్ళే ఆశలతో వయస్సులో ఓ నిమిషం నిట్టూర్పు ఓ నిమిషం మైమరపు అదేమిటో ఈ కధేమిటో
Advertisement

అధరం మధురం నయనం మధురం వచనం మధురం వదనం మధురం చరణం మధురం మధురం మధురం శ్రీ మధురాధిపతి రఖిలం మధురం నా పరువం ప్రణయం పయనం పరుగులే నీ కోసం నా హృదయం వదనం నయనం అడిగెను నీ స్నేహం నీ రూపమే ఆలాపనై నీ చూపుకే నీ దాననై మౌనాలలో దాచానులే రాగాలిలా మోగాలిలా
ఆ సరసం విరసం విరహం సరిగమ సంగీతం ఆ చరణం చలనం గమనం ఇపుడిక నా సొంతం అనుకున్నదే చెప్పాలని అనుకోనిదే అడగాలని ఊరేగిన నా ఊహలో మేఘాలలో తేలానులే
మనసేమో చెప్పిన మాటే వినదు అది ఏమో ఇవాళ పెదవుల్లో దాచినదసలే అనదు అనరాని నిజాలా ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో ఏ మాయ చేసాయో ఏ మత్తు జల్లాయో
Cast & Crew
🎤SingersK.S. ChitraRamana Gogula
✍️Lyricsveturi
🎵MusicRamana Gogula
💫HeroineSakshi Sivanand , Simran
🎬DirectorY.V.S.Chowdary