Advertisement
మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్లి
మట్టి పాలవుతున్న నా ఆశలన్నీ నీలో మల్లి చిగురించాలి
అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిసే నా రాముణ్ణి
బంగారు సీతమ్మవై పూజించుకుంటానని
కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని
Advertisement
మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్లి
పాతికేళ్ల పెనిమిటైన పాపాయిల చూసుకున్న
కాలు జారుతుందో ఏమో అని కల్లాల్లోనే దాచుకున్న
కన్నా బిడ్డ కన్నా మొగుడి మీదనే నా బెంగ ఎల్లప్పుడూ
పిచ్చి తల్లినో గడుసు పిల్లనో చెప్పలేనె ఇప్పుడు
ఏనాడైనా ఒక్క మాటైనా అనలేదమ్మా వెర్రి నాయన
అటువంటి మహారాజుకి తగు జంట అవుతానని
త్వరలోనే నా ఉసుని మరపింప చేస్తానని
మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి
నా ఇంటిలో నువ్వు మల్లి దీపాన్ని పెట్టమ్మా వెళ్లి
ముతైదువుగా పైకి వెళ్లే భాగ్యాన్ని పొందాను గనక
వస్తాను త్వరలోనే మల్లి ఆ పుణ్యమే తోడు రాగ
ఏమి చేసిన కన్నా తండ్రిలా కాపాడు శ్రీవారి ప్రేమ
ఎంత పొందిన తనివి తీరదే కావాలి ఇంకొక్క జన్మ
ఆ చేతుల్లో చిట్టి పాపనై ఉయ్యాలలూగే తృప్తి కోసమై
వచ్చేది నేనేనని గుర్తుంచుకుంటానని
ఆ కొత్త జన్మానికి నా పేరే పెడతానని
మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్లి
మట్టి పాలవుతున్న నా ఆశలన్నీ నీలో మళ్ళీ చిగురించాలి
అప్పగిస్తున్నాను నిన్నే నమ్మి నిత్యం కొలిసే నా రాముణ్ణి
బంగారు సీతమ్మవై పూజించుకుంటానని
కలకాలము పచ్చగా కనిపెట్టి ఉంటానని
మాట ఇవ్వమ్మా చెల్లి మరిచిపోకే నా తల్లి
నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్లి