1996

కొమ్మన్నా కులికే

Kommana Kulike

🎬 Mavichiguru
🎤 K.S. Chitra , S. P. Balasubrahmanyam🎵 S. V. Krishna Reddy✍️ Bhuvanachandra
Advertisement
కొమ్మన్నా కులికే కోయిల ఓ కమ్మని పాటా పాడవే కమ్మగా నవ్వే నెచ్చెలి నీ అందేలా సవ్వడి చెయ్యవే
Advertisement

ఓ ఓ ఓ మామ ఓ ఓ ఓ భామ ఎద లోయల దాగిన చిత్రమా కను సైగలు చేసిన ఆత్రమా ఉదయాలకు నీవే ప్రాణమ కసి ముద్దులు రాసిన కావ్యమా వయ్యారాల వీణ మీటి దోచుకున్న నేస్తమా
కొమ్మన్నా కులికే కోయిల ఓ కమ్మని పాటా పాడవే తేనెలు మరిగిన తుమ్మెద కను చూపుల గారడీ చేయకే
చెప్పేయవా చెవిలోని ఒక మాట పువ్వులతో తుమ్మెద చెప్పే మాట ఆ ఆ నీ చిరు నవ్వు సాక్షిగా తాజ్ మహల్ నాదట నీ పెదవంచు సాక్షిగా షాజహాన్ నేనట
నీ తియ్యని ప్రేమకి నా పెదవే నజరానా నీ పైటకి నేనిక బానిసనే నెరజాణ అనంతాల ఆర్త నీవై చేరుకున్న వేళలో
కోకాలు కట్టిన కోయిల ఓ కమ్మని కౌగిలియ్యవే తేనెలు మరిగిన తుమ్మెద కను చూపుల గారడీ చేయకే
పూసింది కౌగిట్లో పులకింత వెచ్చంగా తాకింది ఒళ్ళంతా పదహారేళ్ళ యవ్వనం పదిలంగా దాచిన నీ మేడలో తాళినై నూరేళ్లు దాగన
నీ చెంతకు చేరా విరహంతో పడలేక నును మెత్తని పరువం రాసింది శుభలేఖ సరాగాల సాగరాన స్వాతి చినుకై సోలిపో
కొమ్మన్నా కులికే కోయిల ఓ కమ్మని పాటా పాడవే తేనెలు మరిగిన తుమ్మెద నీ అల్లరి పనులిక ఆపవే ఓ ఓ ఓ భామ ఓ ఓ ఓ మామ
ఉదయాలకు నీవే ప్రాణమ కసి ముద్దులు రాసిన కావ్యమా ఎద లోయల దాగిన చిత్రమా కను సైగలు చేసిన ఆత్రమా వయ్యారాల వీణ నీవై దోచుకున్న అందమా
కొమ్మన్నా కులికే కోయిల ఓ కమ్మని పాటా పాడవే కమ్మగా నవ్వే నెచ్చెలి నీ అందేలా సవ్వడి చెయ్యవే