లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో
క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో
Advertisement
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
కాసులుంటే తప్ప కళ్ళు ఎత్తి చూడరబ్బో
చిల్లిగవ్వ లేకపోతే నువ్వు పిండి రుబ్బో
రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో రుబ్బో
ఏ పాకెట్ లోన పైసా ఉంటే
ప్రపంచమే పిల్లి అవుతుంది
పులై మనం బతికెయ్యొచ్చు విశ్వదాభిరామ
వాలెట్ లోన సొమ్మే ఉంటే
పాకెట్ లోకి వరల్దే వచ్చి
సలామ్ కొట్టె మామ వినరా వేమా
అరె గళ్ళా పెట్టెకేమో గజ్జల్ కట్టినట్టు
ఘల్ ఘల్ మోగుతుంది డబ్బు
ఏ పెర్ఫ్యూమ్ ఇవ్వలేని
కమ్మనైన స్మెలునిచ్చే అత్తరురా డబ్బూ
అరె తెల్లా మబ్బునైనా నల్లమబ్బు చేసి
వానల్లే మార్చుతుంది డబ్బు
ఫుల్ లోడెడ్ గన్స్ ఇవ్వలేని గట్స్
లోడెడ్ పర్సు ఇవ్వదా
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో
క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో
డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో
మన పెరట్లోన మనీ ప్లాంటు నాటాలా
దాన్ని ఊపుతుంటే డబ్బులెన్నో రాలాల
అరె హ్యాకర్స్ తో పొత్తు పెట్టుకోవాలా
ఆన్లైన్ లోన అందినంత నొక్కాలా
ఎవడి నెత్తినైన మనం చెయ్యి పెట్టాల
అడ్డదారిలోన ఆస్తి కూడ బెట్టాల
ఎన్ని స్కాములైనా తప్పులేదు గోపాల
ఒక్క దెబ్బతోటి లైఫు సెటిలవ్వాల
ఏ చేతిలోన క్యాషే ఉంటే
ఫేసులోకి గ్లో వస్తుంది
ఫ్లాష్ బ్యాకు చెరిపెయ్యొచ్చు
విశ్వదాభిరామ
పచ్చనోటు మనతో ఉంటే
రెచ్చిపోయే ఊపొస్తుంది
కుట్టదంట చీమా వినరా వేమా
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో
క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో
డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో డబ్బో
అరె అంబానీ బిల్ గేట్స్ బిర్లాల
లెక్కకందనంత డబ్బులోన దొర్లాల
కారు బంపర్ బంగారందై ఉండాల
కొత్తిమీరకైనా అందులోనె వెళ్ళాల
ఇప్పుడెందుకింకా తగ్గి తగ్గి ఉండాల
లక్ష బిల్లు అయితే టిప్పు డబల్ కొట్టాల
మనము ఎంత రిచ్చో దునియాకి తెలియాల
జనం కుళ్ళి కుళ్ళి ఏడ్చుకుంటూ సావాల
హే దరిద్రాన్ని డస్ట్ బిన్ లో
విసిరిగొట్టే టైమొచ్చింది
అదృష్టమే ఆన్ ది వే రా విశ్వదాభిరామ
కరెన్సీయే ఫియాన్సీలా
ఒళ్ళో వాలి పోతానంది
రొమాన్సేగా రోజూ వినరా వేమా
లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ డబ్బో
ఎవడు కనిపెట్టాడో గాని దీని అబ్బో
క్యాష్ లేని లైఫే కష్టాల బాత్ టబ్బో
పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్సు క్లబ్బో
క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో క్లబ్బో
రా దిగిరా నిన్ను సంచుల్లో కట్టేసి
గుడ్డల్లో కప్పేసి దాచేస్తే దండెత్తిరా
రా దిగిరా ఊపిరాడకుండా
చీకట్లో చెమటట్టి పోతావు
స్విస్ బ్యాంకు గోడ దూకిరా
బలిసున్న కొంపల్లో సీక్రెట్టు లాకర్లు
బద్దలు కొట్టుకుంటూ రా
నీకు ప్రాణాలు ఇచ్చేటి ఫాన్స్ ఇక్కడున్నారు
బుల్లెట్టు బండెక్కి రా
రా బయటికిరా రా దిగిరా రా దిగిరా
రా దిగిరా